ఆ సినిమా ఇండియాలో వద్దంటున్న సన్నీ | Why sunny leone not intrest to release her Documentary in India

Why sunny leone not intrest to release her documentary in india

sunny leone not intrest to release her Documentary, sunny leone on her documentar, sunny leone documentary

Why sunny leone not intrest to release her Documentary in India

సొంత సినిమాను అడ్డుకుంటున్న సన్నీ

Posted: 09/21/2016 02:45 PM IST
Why sunny leone not intrest to release her documentary in india

శృంగార తార సన్నీలియోన్ నటించిన ఓ సినిమా భారత్ లో విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సినిమా విడుదలకు అభ్యంతరం చెబుతూ దీనికి అడ్డుపడుతుంది ఎవరో కాదు స్వయానా సన్నీనే. తన గతాన్ని వెలికి తీసే ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రిలీజ్ చేయనని ఆమె చెబుతోంది. ఇంతకీ అదేం సినిమా?

దిలీప్ మెహతా అనే దర్శకుడు ఈ మాజీ పోర్న్ స్టార్ లైఫ్ ఆధారంగా ఓ డాక్యుమెంటరీని తీశాడు. ఈ మధ్యే టోరంటో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో దానిని ప్రదర్శితం కూడా చేశారు. అయితే దానికి పెద్దగా స్పందన రాకపోగా, స్వస్థలంలో ఆమెకు అవమానం కూడా జరిగింది. భారత్ మూలాలున్న సన్నీ కుటుంబం కెనడాలోని సార్నియాలో ముందు సెటిల్ అయ్యింది. ఆమె అక్కడే పుట్టింది కూడా. కొన్నేళ్ల తర్వాత ఆమె ఫ్యామిలీ లాస్ ఏంజిల్స్ కు తరలివెళ్లింది. పరిస్థితుల ప్రభావంతో పోర్న్ స్టార్ గా మారి ఆ ఫీల్డ్ లో దుమ్మురేపింది. బిగ్ బాస్ షో పుణ్యమాని ఆమె లైఫ్ మారిపోయి బాలీవుడ్ లో స్టార్ గా సెటిల్ అయిపోయింది.   

ఈ ఘనతలన్నింటితో కూడిన డాక్యుమెంటరీపై స్వస్థలంలో ఎవరూ అంత ఆసక్తి చూపలేదంట. ముఖ్యంగా పుట్టిపెరిగిన సార్నియా వాసులు ఆమె గురించి మాట్లాడేందుకు నిరాకరించడం విశేషం. దీంతో సన్నీ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు తన డాక్యుమెంటరీని ఇండియాలో ప్రదర్శితం చేసేందుకు ఆసక్తి కూడా చూపటం లేదు. తన డాక్యుమెంటరీపై విభిన్నాభిప్రాయాలు తలెత్తే అవకాశాలున్నందున భారత్‌లో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేయనని సన్నీ వెల్లడించింది. ఇది బయోపిక్ కాదని సినిమాల్లో నటించడం స్వేచ్ఛని.. ఎలా నటించాలన్నది తన ఇష్టమని అంటోంది. సొంతింటనే తనకు మర్యాద దక్కకపోవడంపై కాస్త బాధగానే ఉన్నా.. పట్టించుకోనని తెలిపిందీ మాజీ అడల్ట్ స్టార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  documentary  not released  India  

Other Articles