ప్రేమమ్ ట్రైలర్ క్రియేటివిటి గమనించారా? | Naga Chaitanya Premam Trailer Talk

Naga chaitanya premam trailer talk

Naga Chaitanya Premam Trailer, Premam telugu trailer, Premam Trailer Talk, Premam telugu movie, Premam release date, Premam movie, Premam trailer

Naga Chaitanya Premam Trailer Talk.

ట్రైలర్ : చైతూ ప్రేమమ్ ఇంప్రెసివ్

Posted: 09/21/2016 01:00 PM IST
Naga chaitanya premam trailer talk

ప్రేమ కథలు ముగుస్తుంటాయి. కానీ, ఆ ఫీలింగ్స్ కి మాత్రం చావు ఉండదు. ఇదే మెయిన్ థీమ్ నాగ చైతన్య మన ముందుకు మజ్నుగా రాబోతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ నిన్న ఆడియో సందర్భంగా విడుదలైంది.

ప్రేమికుల కోసమే అన్నట్లుగా 1.43 నిమిషాల నిడివితో ట్రైలర్ ను కట్ చేసింది చిత్ర యూనిట్. మళయాళం వర్షన్ ని యథాతథంగా తెరకెక్కించిన దర్శకుడు చందూ మొండేటి ఆ ఫీల్ ను అలాగే కొనసాగిస్తూ తెరకెక్కించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమైపోతుంది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే... ''ప్రపంచంలో ప్రతీ ప్రేమకథా మధురంగా ఉంటుంది. మనది మనకు అద్భుతంగా ఉంటుంది'' అంటూ రచ్చలేపే డైలాగ్ తో చైతూ ఎంట్రీ ఇస్తాడు. మూడు దశలు, మూడు ప్రేమ కథలు, ముగ్గురు హీరోయిన్లు ఇలా సాగిపోతుంది కథ. ముగ్గులోకి దించేందుకు ఫ్రెండ్స్ ని వాడుకోవటం. కానీ, అనుకోని మలుపులతో ఆ ప్రేమలు ముగియటం. చివర్లో బాధైనా, సంతోషమైనా, ఇన్నేళ్లు తొడుంది ఇదే కదా అంటూ మందు కొట్టే డైలాగుతో ముగించేశాడు. గోపిసుందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. కార్తీక్ ఘట్టమనేని ఇచ్చిన విజువల్స్.. దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అండ్ టేకింగ్.. అన్నీ పర్ఫెక్టుగా సింక్ అయ్యాయ్. ఓవరాల్ గా ''ప్రేమమ్'' ట్రైలర్లో ఉన్న ఫీల్ మాత్రం అదిరిపోయింది.

ముఖ్యంగా చిన్ననాటి చైతూ.. కాలేజీ బాయ్ చైతూ.. అలాగే మెట్యూర్డ్ చైతూ గెటప్పులు చాలా బాగున్నాయి. ఇంప్రెసివ్ అనే చెప్పాలి. ఇక లెక్చరర్ పాత్రలో శృతి హాసన్ బ్యూటిఫుల్ లుక్.. అనుపమ పరమేశ్వరన్ ఫ్యామిలీ లుక్... మడోన్నా సెబాస్టియన్ చలాకీతనం బాగా నప్పాయి. దసరా సందర్భంగా ప్రేమమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Premam  Trailer  

Other Articles