Sirivennela Hero Sarvadaman D Banerjee about movie chances

Sirivennela hero sarvadaman d banerjee about movie chances

Sirivennela Hero Sarvadaman D Banerjee, Sarvadaman D Banerjee about Sirivennela, Sarvadaman D Banerjee carrier, Sarvadaman D Banerjee interview, Sarvadaman D Banerjee movie offers, Where is Sirivennela Hero

Sirivennela Hero Sarvadaman D Banerjee about his carrier.

సిరివెన్నెల హీరో ఏం చేస్తున్నాడో తెలుసా?

Posted: 09/17/2016 04:27 PM IST
Sirivennela hero sarvadaman d banerjee about movie chances

భారతీయుల సంగీత కళని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది కళాతపస్వి కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సిరివెన్నెల. గేయ రచయిత సీతారామశాస్త్రి ఇంటి పేరుగా మారిపోయిన ఈ సినిమా. సంగీత ‘మామ’ కె.వి.మహదేవన్, అందించిన స్వరాలు, అందుకు తగ్గట్లుగా ప్రముఖ ఫ్లూటు విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా అందించిన వేణుగానం, గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గాత్రం ఇలా ఒక్కటేంటి అన్ని ఈ సినిమాను ఆల్ టైం క్లాసిక్ గా నిలబెట్టాయి. 30 ఏళ్లు అయినా ఈ చిత్రంలోని పాటలు నిత్యం ధ్వనిస్తూనే ఉంటాయి.

ఇక పరభాష నటుడైనప్పటికీ, తెలుగులో తడబడకుండా ఓ అంధ వేణుగాన విద్వాంసుడిగా అద్భుతంగా నటించాడు సర్వదమన్ బెనర్జీ అలియాస్ బెనర్జీ. ఆపై స్వయం కృషి, కొన్ని ఇతర భాషల చిత్రాల్లో నటించిన ఆయన, బుల్లితెరపై రామానందసాగర్ తీసిన శ్రీకృష్ణ సీరియల్ లో కృష్ణుడి పాత్రలో ఒదిగిపోయాడు. మరి ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించి అజ్నాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఆయనను న్యూస్ చానెల్ సంప్రదించగా, ఆసక్తికర విషయాలు చెప్పుకోచ్చారు.

సాధారణంగా సినిమాల్లో అవకాశాల కోసం చాలా తిరగాల్సి ఉంటుంది. కానీ, నా అదృష్టం ఈ రోజు వరకు ఏ నిర్మాత వద్దకు వెళ్లలేదని బెనర్జీ అంటున్నాడు. ‘నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండో సంవత్సరం చదువుతున్న రోజులవి. ఫిల్మ్ ఫెస్టివల్ కోసం బెంగళూరు వెళ్లాను. అక్కడ ఓ వ్యకత్ి మాసిన తెల్లటి గడ్డం, తెల్లటి కుర్తా, ధోవతి, చెప్పులు లేకుండా నడచుకుంటూ నేరుగా నా వైపే వచ్చారు.నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. 'ఆదిశంకరాచార్య సినిమా తీస్తున్నాను, లీడ్ రోల్ మీరే చేయాలి' అన్నారు. చేతిలో సిగిరెట్ తో ఉన్న నేను అవాక్కయ్యాను. ఆదిశంకరుడి పాత్రలో నేనా! అని ఆశ్చర్యమేసింది. ‘నాలో ఏం చూసి, ఈ పాత్రకు సెలక్టు చేసుకున్నారు? అని అడిగాను. ‘మీ కళ్లు’ అని ఆయన సమాధానమిచ్చారు. అప్పటిదాకా తెలియదు నేను మాట్లాడింది టాప్ డైరక్టర్ మిస్టర్ జీవి అయ్యర్ (కన్నడ భీష్మ అని ముద్దుగా పిలుస్తారు) తో అని చెప్పుకోచ్చారు.

ఇక ఆ తర్వాత ఆయన నన్ను మళ్లీ సంప్రదించలేదు. కొద్దికాలం తర్వాత ట్రెయినింగ్ పూర్తయి ఇంటికి తిరుగుపయనం అవుతున్న సమయంలో మద్రాసు నుంచి నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. 'ఎన్ఎఫ్డీసీ పెట్టుబడితో సినిమా మొదలవుతోంది, మద్రాసు రండి' అని ఆ టెలిగ్రామ్ లో ఉంది. అలా ఆదిశంకరాచార్య చిత్రంలో నటించాను. రెండున్నర సంవత్సరాల పాటు గుండు, మేకప్ లేకుండా, ఒకే కాస్ట్యూమ్, కాళ్లకు చెప్పులు లేకుండా ఉన్నాను. ఇక అది చూసి ‘సిరివెన్నెల’ లో ఛాన్స్ ఇచ్చారు విశ్వనాథ్ గారు. ఆ సినిమా కోసం నా ప్రాణం ఇచ్చాను. మంటకు అనుగుణంగా ఫ్లూట్ వాయించే సీన్ లో రియాల్టీ కోసం తపించాను. విశ్వనాథ్ గారు వారించిన వినలేదు. అందుకే ఆ సీన్ అంతగా పండింది అంటూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాల మీద ఆసక్తి లేదు. అవకాశాలు వస్తే మాత్రం అస్సలు వదులుకోను అంటున్నాడు ఆయన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sirivennela Hero  Sarvadaman D Banerjee  

Other Articles