భూకబ్జా కేసులో ప్రముఖ తెలుగు నిర్మాత అరెస్ట్ | tollywood producer mvv satyanarayana arrested for land grabbing

Tollywood producer mvv satyanarayana arrested for land grabbing

tollywood producer mvv satyanarayana, Vishnu producer arrest for land grabbing, mvv satyanarayana arrested, producer mvv satyanarayana arrested, Lakkunodu producer arrested

tollywood producer mvv satyanarayana arrested for land grabbing.

విష్ణు నిర్మాతను అరెస్ట్ చేసేశారు

Posted: 09/17/2016 04:04 PM IST
Tollywood producer mvv satyanarayana arrested for land grabbing

వర్థమాన నిర్మాత ఒకరు అరెస్ట్ కావటం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం రాజ్ కిరణ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లక్కున్నోడు నిర్మాత ఎంవీవీ సత్యనారాయణను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భూములను కబ్జా చేసి, అందులో లేఅవుట్లు వేశారని సత్యనారాయణపై అభియోగాలు ఉన్నాయి. ఆరోపణలు రుజువు కావటంతో శనివారం లాసన్స్‌ బే కాలనీలోని నివాసంలో అతన్ని అరెస్ట్ చేశారు.

కాగా, స్థానిక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన రాజశేఖరరెడ్డి స్టేడియంకు ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 357/1, 357/2 భూములు గతంలో మధురవాడ పంచాయతీ అనుమతి పొందిన స్థలాలు. వీటిని గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులు లేఅవుట్‌ వేయగా, అందులో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 88 మంది కొనుగోలు చేశారు. వారిలో 38 మంది నుంచి భూములు కొనుగోలు చేసిన ఎంవీవీ సంస్థల అధినేత సత్యనారాయణ ‘విశాఖపట్నం సీటీ’ పేరిట ఓ గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ ను ప్రారంభించారు.

వ్యాపార విస్తరణలో భాగంగా భారీ ఎత్తున ప్రకటన బోర్డులు, హోర్డింగులతో ప్రకటనలు గుప్పించారు. దీంతో, ఈ లేఅవుట్‌ లో ఉన్న ఇతరుల భూముల్ని ఆక్రమించి ఆయన లే అవుట్ కు రోడ్డు వేసుకున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా, వారికి సంబంధించిన భూముల్లో ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ పోలీస్ ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టు సమయంలో తనకు గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. తనపై టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు కుటుంబ సభ్యులు కక్షగట్టారని, వారే తనపై లేనిపోని నిందలు మోపి, తనను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని సత్యనారాయణ చెబుతుండటం విశేషం.

కాగా, ఎంవీవీ సంస్థ పై నిఖిల్ హీరోగా వచ్చిన శంకరాభరణం, అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి, త్రిష అభినేత్రి చిత్రాలకు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహారించాడు. ప్రస్తుతం విష్ణు హీరోగా లక్కునోడు చిత్రాన్ని నిర్మిస్తుండటంతోపాటు, అందులో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood producer  MVV Satyanarayana  Arrest  Land Grabbing  

Other Articles