షూటింగ్ మొదలుపెట్టకుండానే వెంకీ సినిమా ఫస్ట్ లుక్ | venkatesh Guru first look release

Venkatesh guru first look release

Venkatesh Salakhadoos remake Guru, Venky Guru First Look, Venkatesh movie first look, Venky Guru Firstlook, Venky as Boxing Coach, venky Guru Firstlook, Venky Guru Heroine

Venkatesh Salakhadoos remake Guru First Look release.

షూటింగ్ మొదలవ్వకముందే వెంకీ సినిమా ఏంటిది?

Posted: 09/16/2016 04:11 PM IST
Venkatesh guru first look release

రీమేక్ లతో వరుస విక్టరీలు కొడుతున్న టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. బాబు బంగారం తర్వాత మాధవన్ హీరోగా బాలీవుడ్ లో సైలెంట్ హిట్ అయిన సాలా ఖడ్డూస్ ను తెలుగులో తీయబోతున్నారని తెలిసిందే.

మాతృక దర్శకత్వం వహించిన సుధా కొంగర డైరక్షన్ లో అందులో కీలక పాత్ర పోసించిన రితికా సింగ్ హీరోయిన్ గా నటించబోతుంది. బాక్సింగ్ కోచ్ అవతారం కోసం వెంకీ వర్కవుట్ లు చేస్తున్నాడు. అల్రెడీ గురు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేసింది చిత్ర యూనిట్.

శనివారం సాయంత్రం గురు గా వెంకీ ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని నిశ్చయించుకున్నారంట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేసింది డైరక్టర్ సుధా కొంగర. త్వరలో రెగ్యులర్ షూటింగును ప్రారంభించి, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు వెంకీ ప్రయత్నిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Guru  firstlook  

Other Articles