వెటరన్ మ్యూజిక్ డైరక్టర్ గోల్డ్ మాన్ సీక్రెట్ | Bappi Lahari gold man secret.

Bappi lahiri said why turned into gold man

Bappi Lahari gold man secret., Bappi Lahari Gold Man, Why Bappi Lahari turns into Gold Man, Music Director Goldd Secret, Music Director Gold sentiment

Bappi Lahari gold man secret.

గోల్డ్ మాన్ గా మారటం వెనుక సీక్రెట్ చెప్పేశాడు

Posted: 09/15/2016 04:34 PM IST
Bappi lahiri said why turned into gold man

వెటరన్ మ్యూజిక్ దర్శకుడు, బాలీవుడ్ చేత ముద్దుగా గోల్డ్ మాన్ అని పిలిపించుకునే బప్పీలహరి మ్యూజిక్ తో ఎంత రాకింగ్ చేస్తాడో తెలిసిందే. 80వ దశకం నుంచి ప్రారంభమైన ఆయన సంగీత వీరవిహారం సౌత్ లో కూడా నడిచిందంటే అతిశయోక్తికాదు. తెలుగులో కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు చిత్రాలకు ఆయన బాణీలు అందించారు. ఆ మధ్య డర్టీ పిక్చర్ లో ఊలాలా ఊలాల అంటూ పాటపాడి ఈ వయసులోనూ షేక్ చేసి పడేశాడు.  

ఆయన మ్యూజిక్ ఎంత ఫేమస్ అయిందో, మెడ నిండా రకరకాల బంగారు గొలుసులు ధరించే ఆయన కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. బప్పీ బిల్డప్ కోసమే ఆ షో అంతా చేస్తున్నాడని అంతా భావించారు. కానీ, అందుకు గల కారణాన్ని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అమెరికన్ రాక్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ కి బప్పీలహరి వీరాభిమాని. ఎల్విస్ ప్రెస్లీ కూడా రకరకాల బంగారు గొలుసులు వేసుకునేవాడని, ఏదోఒక రోజు తాను కూడా అంతటి వాడినని కావాలని, తన కంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ విధంగా గొలుసులు ధరిస్తుంటానని బప్పీలహరి చెప్పారు. అయితే అది తనకు బాగా కలిసొచ్చిందని, ప్రస్తుతానికి బంగారం, ప్లాటినం, వెండి కలిపి తయారు చేసిన ల్యూమినెక్స్ యూనో ఆభరణాలే వాడుతున్నానని చెప్పారు. అన్నట్లు ఇప్పుడు ఆయనగారు అంతర్జాతీయ పాప్ సింగర్లు జూలియా ప్రైస్, ఏకాన్, స్పూప్ డాగ్ లతో కలిసి పనిచేస్తున్నానని బప్పీలహరి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bappi Lahari  Gold Man  Secret  

Other Articles