కాటమరాయుడి కోసం మళ్లీ అక్కడికేనా? | pawan kalyan join Katamarayudu shooting soon

Pawan kalyan join katamarayudu shooting soon

Katamarayudu Shooting, Katamarayudu onlocation, Katamarayudu Shooting Pawan, Pawan Katamarayudu Shooting, Pawan Kalyan Join Katamarayudu shooting, Pawan in Katamarayudu location, katamarayudu Veeram Remake, Katamarayudu september 24

Date fix for pawan kalyan join in Katamarayudu Shooting.

కాటమరాయుడు డేట్ ఫిక్స్ చేసుకోండి

Posted: 09/15/2016 03:45 PM IST
Pawan kalyan join katamarayudu shooting soon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడిగా తన జోరును చూపించేందుకు సిద్దమైపోతున్నాడు. ఇప్పటికే నాన్ స్టాప్ రాజకీయ కమిట్ మెంట్లు పూర్తి చేసుకున్న పవన్ త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న కాటమరాయుడు, ఈ నెల 20 నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభంకాబోతుంది.

పవన్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసిన దర్శకుడు డాలీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లను తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. ఫిట్ నెస్ పవన్ మరోసారి బెంగళూరు వెళ్లనున్నట్లు చెప్పుకుంటున్నారు. 20నే సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ, నాలుగు రోజుల తర్వాత పవన్ సెట్లో జాయిన్ కానున్నాడంట. ఈ విషయాలను ఓ జాతీయ మీడియాకు తెలియజేసినట్లు సమాచారం.

ఈ యేడాది ప్రథమార్థంలో వచ్చిన గబ్బర్ సింగ్ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రేమకథగా రాబోతున్న కాటమరాయుడిపై అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అజిత్ హీరోగా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'వీరమ్' సినిమా రీమేక్‌గా 'కాటమరాయుడు' తెరకెక్కిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan Kalyan  Shooting  

Other Articles