గ్యారేజ్ సక్సెస్ మీట్ లో ఏడ్చేసిన ఎన్టీఆర్ | NTR and Kalyan Ram speech at Janatha Garage Successmeet

Ntr and kalyan ram speech at janatha garage successmeet

NTR and Kalyan Ram at Janatha Garage successmeet, NTR speech at at Janatha Garage successmeet, Kalyan Ram Speech at Janatha Garage Successmeet, Sukumar speech at Janatha Garage successmeet, Koratala Speech at Garage Successmeet.

NTR and Kalyan Ram speech at Janatha Garage Successmeet.

ఈ క్షణాల కోసం ఏళ్లు ఎదురుచూశా!

Posted: 09/14/2016 10:14 AM IST
Ntr and kalyan ram speech at janatha garage successmeet

టాలీవుడ్ లో ఉన్న అద్భుతమైన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్ఛితంగా ఉంటాడు. యాక్టింగ్ పరంగా యంగ్ టైగర్ కి ఎలాంటి వంకలు లేకపోయినప్పటికీ, సినిమాలపరంగా రికార్డులు లేవనే చెప్పుకోవాలి. కానీ, కొడితే మాత్రం ఎలా ఉంటుందో జనతా గ్యారేజ్ తో చూపించేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఆ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్, సుకుమార్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు.

ఇక పంక్షన్ లో ఉద్వేగపూరితంగా ప్రసగించాడు ఎన్టీఆర్. ''ఏడుపు అపుకుంటున్నాను. ఆనందంతో వచ్చే ఏడుపే. కాని ఆపుకుంటున్నాను'' అంటూ కంటతడి పెట్టిన తారక్ ఇలాంటి క్షణాల కోసం ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ''13 ఏళ్లు అయ్యింది. ఒక వెలుగు కనిపిస్తోందని చెప్పాను ఆడియో ఫంక్షన్లో.. అదే నిజమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజైనప్పుడు.. రకరకాల రిపోర్టులు వచ్చినప్పుడు.. అసలు ఆ ఫీడ్ బ్యాక్ వింటుంటే.. మీలో ఈ ఆనందాన్ని చూడ్డానికి ఇన్నేళ్ళుపట్టిందా అంటూ నేనే ఆనందపడ్డాను. జనతా గ్యారేజ్ ద్వారా అమ్మానాన్నలకు - అభిమానులకు - అందరికీ అద్భుతమైన ఆనందాన్ని పంచాను’’అంటూ చెప్పాడు ఎన్టీఆర్.

Janatha Garage Success Meet Stills

 ''విజయాలు దక్కుతున్నాయి. విజయాలు వస్తున్నాయి. కాని ఇలాంటి విజయం కోసం ఎన్నేళ్ళు ఆగానో మీ అందరికీ తెలుసు. అభిమానుల ముందు తలెత్తుకు తిరిగే విజయాన్ని అందించిన కొరటాల శివకు ఆజన్మాంతం ఋణ పడిపోయి ఉంటాను'' అంటూ మరింత ఎమోషనల్ అయిపోయాడు. ఇక సోదరుడు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... ‘నాన్నా.. పండగ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తూ నటుడు కల్యాణ్ రామ్ అన్న డైలాగ్ లకు చప్పట్లు మార్మోగాయి.

 ‘మీ ఆకలి తీరింది. నాది, నా తమ్ముడి ఆకలి తీరింది. మీ అందరూ మా ఆకలి తీర్చారు. గూబ గుయ్యి మనేలా సూపర్ హిట్ ఎప్పుడు కొడతామని గత మూడేళ్లుగా ప్రతిరోజూ, ప్రతిసారి నేను, నా తమ్ముడు తారక్ అనుకునేవాళ్లం. ఈసారి కుదిరింది. కొడితే ఎలా ఉంటుందో, మీ అందరూ చూపించారు. మొన్న తారక్ చెప్పిన విషయాన్నే నేను మళ్లీ చెబుతున్నాను.. మా నాన్నగారి షష్టి పూర్తికి ఈ చిత్రం విజయాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు’ అని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Kalyan Ram  Janatha Garage Successmeet  

Other Articles