విజయదశమికి బాలయ్య సందడి | Gautamiputra Satakarni First Look Teaser Release on Dussera

Gautamiputra satakarni first look teaser release on dussera

Gautamiputra Satakarni First Look Teaser, Gautamiputra Satakarni teaser, Gautamiputra Satakarni updates, Gautamiputra Satakarni teaser Dussera, Nandamuri Dussera Treat, Balayya Dasurrera treat, Krish GSP teaser

Gautamiputra Satakarni First Look Teaser Release on Dussera.

శాతకర్ణి టీజర్ డేట్ ఫిక్సయ్యిందా?

Posted: 09/13/2016 05:35 PM IST
Gautamiputra satakarni first look teaser release on dussera

ఓ చారిత్రక చిత్రం తెరకెక్కించాలంటే చరిత్రకు సంబంధించిన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆ విషయంలో క్రిష్ బాగా ఆరితేరాడు. కంచె ద్వారా రెండో ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇక ఇప్పుడు బాలయ్యతో తెలుగు నేలపై తొలిరాజు శాతకర్ణి జీవితగాథనే తెరకెక్కించబోతున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి  షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

కోట సన్నివేశాలు, పట్టాభిషేకం, రాజసూయ యాగం, తదితర సన్నివేశాలతోపాటు రెండు పాటలను కూడా చిత్రీకరించే పనిలో ఉన్నాడంట. బాలయ్య బర్త్ డే కి ఓ లుక్, శ్రీయా పుట్టిన రోజుకి ఓ లుక్ విడుదల చేసిన క్రిష్, ఎప్పటికప్పుడు ఈ విషయంలో మాత్రం అప్ డేటెడ్ గానే ఉంటున్నారు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కోసం మరో ఫెంటాస్టిక్ ట్రీట్ కి దసరాను వేదిక చేయబోతున్నాడని తెలుస్తోంది.

అక్టోబర్ 7 విజయదశమి సందర్భంగా చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నాడంట. ఇప్పటిదాకా చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలతోపాటు, బాలయ్య లుక్ స్పెషల్ గా ఇందులో చూపించబోతున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ రాజమాతగా, శ్రీయా రాణి వశిష్టిదేవీ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Teaser  Dussera  

Other Articles