మళ్లీ నిత్యానందుడి సేవలో నటి రంజిత | Ranjitha back with Nithyananda's Preaches

Ranjitha back with nithyananda s preaches for telugu channel

Ranjitha Nithyananda, Ranjitha back with Nithyananda's Preaches, Ranjitha with Nithyananda's Preaches, Ranjitha is Back, Ranjitha Telugu Devotional Channel, Ranjitha Nithyananda relation

Ranjitha back with Nithyananda's Preaches for Telugu Devotional Channel.

మరోసారి నిత్యానందుడి సేవలో రంజిత!

Posted: 09/13/2016 05:22 PM IST
Ranjitha back with nithyananda s preaches for telugu channel

దైవాంశసంభూతుడిగా చెప్పుకునే నిత్యానంద స్వామితో రాసలీలల్లో పాల్గొన్నట్లు వార్తల్లోకి ఎక్కిన నటి రంజిత గుర్తుందా? ఆ మధ్య వీడియోలు రిలీజ్ చేసిన చానెల్ పై విమర్శలు చేసిన ఆమె తర్వాత ఎక్కడా కనిపించలేదు.  ఆరోపణలు వచ్చినా సరే స్వామీగారి సేవలోనే గుట్టుచప్పుడు కాకుండా ఆమె ఇంతకాలం తరిస్తూ వస్తోంది.  ఇక త్వరలో కెమెరా ముందుకు రాబోతుందట.

అయితే ఆమె కనిపించబోయేది సినిమాల పరంగా కాదు సుమీ. తన దైవం నిత్యానంద ప్రవచనలు ప్రచారం చేసుకుంటూ కాలం గడపాలని ఆమె ఫ్లాన్ వేసుకుంటోంది. ఇందుకోసం త్వరలో ప్రారంభం కాబోయే ఓ తెలుగు ఆధ్యాత్మిక చానెల్ ను ఎంచుకుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. సదరు ఛానెల్ అధినేత నిత్యానంద హార్డ్ కోర్ ఫ్యాన్ కావటంతో ఆమె తన పని మరింత సులువైందని సంబర పడుతుంట. నిజానికి ఆ చానెల్ ను ఆమె రూపకల్పన చేసిందన్న మరో టాక్ కూడా వినిపిస్తోంది.

90వ దశకంలో పలు తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించిన రంజిత మావిచిగురు లాంటి సినిమాతో బాగా గుర్తింపు పొందింది. ఆపై సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోకుండా నిత్యానందుడి పాదదాసీగా మారిపోయింది. ఇక దసరా నుంచి ప్రారంభం కాబోయే ఈ చానెల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు స్వామివారి ప్రవచనాలు అందించేందుకు రెడీ అయిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithyananda Swamy  Ranjitha  Telugu Devotional Channel  Preaches  

Other Articles