నాని లవ్ లెటర్లు రాసిన హీరోయిన్ ఎవరు? | Nani love letters for Majnu Movie Heroine

Nani love letters for majnu movie

Hero Nani in majnu promotions, Nani about Majnu Movie, Majnu Promotions, Hero Nani Love Affair, Nani affair with Nithya Menon, Nani Love Letters to that heroine, Nani Majnu Promotions, Nani Majnu Interview

Hero Nani speed up for Majnu Promotions.

హీరోయిన్ కి లవ్ లెటర్లు రా'సిన హీరో

Posted: 09/13/2016 03:42 PM IST
Nani love letters for majnu movie

టాలీవుడ్ హీరో ఓ యంగ్ హీరో రాసిన లవ్ లెటర్ల వ్యవహారం ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో అనేగా? ఇంకెవరు నేచురల్ స్టార్ నాని, రాసింది ఎవరికో కాదు హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్. దీని గురించి అడిగితే అవును ప్రేమకథ పండాలంటే ఆ మాత్రం పొగడాలి కదా అంటున్నాడు. ఇదంతా మజ్ను ప్రమోషన్ లో చెబుతున్నాడు లేండి.

పాత రోజుల్లో ఒక అమ్మాయిని బుట్టలో పడేయాలంటే ఆమె అందాన్ని వర్ణిస్తూ అద్భుతంగా ఓ కవిత్వం అల్లి, దానిని పేపర్ మీద పెట్టి ప్రేమ లేఖ రూపంలో అందించి అబ్బో ఇలా చాలా కష్టాలు పడితేనే తప్ప వర్కవుట్ అయ్యేది కాదు. కానీ, ఇప్పుడు ఈమెయిల్, ఛాటింగ్, వాట్సాప్, ఫేస్ బుక్ లను పట్టుకుంటే చాలూ బస్ ఖేల్ ఖతం. మరి నాని కూడా ఆ పని చేయొచ్చు కదా అంటారా? దానికి అతగాడి దగ్గర ఆన్సర్ ఉందట.

ప్రేమకు సింబల్ మజ్ను అన్న పేరు. మరి అలాంటి కథకు ఇలాంటివి ఉంటేనే కదా పరిపూర్ణత వచ్చేది అంటున్నాడు. భీమవరం బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథ అద్భుతంగా వచ్చిందని, ప్రేమలో ఫేలయితే జీవితాలను నాశనం చేసుకోకుండా ఎలా ఉండాలన్న కథాంశంతో యంగ్ స్టర్ ఓ మెసేజ్ లాగా చెబుతున్న కథే ఇదని నాని చెప్పుకొచ్చాడు. మరి రియల్ లైఫ్ లో లవ్ ఫెయిల్యూర్ గురించి(అప్పట్లో తనతో ఓ రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్ తో లవ్ ట్రాక్) గురించి అడిగితే, అసలు అలాంటిది ఏం లేదని నవ్వుతూ తప్పించుకున్నాడు. అన్నట్లు అల్రెడీ సెన్సార్ అయి యూ బై ఏ సర్టిఫికెట్ తో ఈ నెల 23న మన ముందుకు రాబోతున్నాడీ మోడ్రన్ మజ్ను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Majnu Movie  Promotions  

Other Articles