వెంకీకి జోడీగా నిత్యామీనన్ | Nithya Menon to pair up with Venkatesh

Nithya menon to pair up with venkatesh

Nithya Menon to pair up with Venkatesh, Nithya Menon in Venky movie, Nithya menon now yes for Venky, Kishore Tirumala Venky movie actress, Venky nithya Menon

Nithya Menon to pair up with Venkatesh for Kishore Tirumala movie.

అప్పుడు నో అన్న హీరోకి ఇప్పుడు జోడీగా...

Posted: 09/10/2016 04:37 PM IST
Nithya menon to pair up with venkatesh

టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆరేళ్లు అయినప్పటికీ పరభాషల్లో తప్పించి ఇక్కడ సీనియర్ హీరోలతో నిత్యామీనన్ నటించిన దాఖలాలు లేవు. గతంలో ఓసారి వెంకటేష్ హీరోగా సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. అయితే తన కన్నా ఏజ్ లో పెద్దయిన హీరోతో ఆడలేనంటూ సున్నితంగా తిరస్కరించింది. తెలుగులో టాప్ హీరోల పక్కన కేవలం గ్లామర్ డాల్ గానే చూపిస్తారంటూ అప్పుడు ఓ రీజన్ చెప్పి తప్పించుకుంది లేండి. కట్ చేస్తే... కానీ, ఇప్పుడు అదే హీరోతో ఇప్పుడు సినిమా చేయబోతుంది.  

తెలుగులో వెంకటేశ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నిత్యామీనన్ ను ఎంపిక చేశారు. ఆమే ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసింది. ఒక మధ్యవయసు వ్యక్తికి .. ఒక యువతికి మధ్య చోటుచేసుకునే ప్రేమ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. తాను ఇంతవరకూ చేయని పాత్ర కావడంతో, నిత్యామీనన్ అంగీకరించింది. 'నేను శైలజ' వంటి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తుండటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక కథ వినగానే వెంకటేశ్ ఓకే చేసేయడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం వెంకటేశ్ చేస్తోన్న 'సాలా ఖడ్డూస్' రీమేక్ పూర్తయిన తరువాత, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం సావిత్రి బయోపిక్ కోసం నిత్యామీనన్ ప్రిపేర్ అయిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithya Menon  Venkatesh  Kishore Tirumala movie  

Other Articles