సినిమాల్లోకి శరత్ కుమార్ | Sarathkumar busy with serial movies

Sarathkumar explains how he miss robo 2 0 chance

Sarathkumar back to movies, Sarathkumar miss Robo 2.0 movie, Why Shankar sorry to sarathkumar, sarathkumar about Adangathey

Kollywood star hero Sarathkumar back to movies.

రజనీ ఓకే అన్నాడు... శంకర్ సారీ చెప్పాడు

Posted: 09/10/2016 02:45 PM IST
Sarathkumar explains how he miss robo 2 0 chance

ఫ్యామిలీ ఆడియన్స్ నే కాదు, ఇంకోవైపు మాస్ ఆడియన్స్ ను తనదైన శైలిలో మెప్పించి 90వ దశకంలో కోలీవుడ్ స్టార్ హీరోగా చెలామణి అయ్యాడు శరత్ కుమార్. అనువాద చిత్రాలతోపాటు, అరడజనుపైగానే తెలుగు స్ట్రెయిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. హీరోగా కెరీర్ ముగింపు దశలో ఉండగా రాజకీయాల వైపు దృష్టి లాగటంతో ఆవైపు అడుగులు వేసి తడబడ్డాడు. ఈ గ్యాప్ లో అరకోర సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. అయితే తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు శరత్ కుమార్ రంగం సిద్ధం చేసుకున్నాడు.

ఆ మధ్య రోబో 2.0 కోసం రజనీ స్వయంగా ఫోన్ చేసి విలన్ పాత్రను ఆఫర్ చేశారు.  కానీ, తర్వాత దర్శకుడు శంకర్ ఫోన్ చేసి సినిమాకు ఉన్న రిక్వయిర్ మెంట్ మూలంగా అక్షయ్ కుమార్ ను తీసుకుంటున్నట్లు వివరించి సారీ చెప్పాడు. ఇంకోవైపు జయం రవి తని ఒరువన్( తెలుగులో రాంచరణ్ తీయబోతున్న ధ్రువ మాతృక) లో విలన్ అరవింద్ స్వామి పాత్ర ముందు ఈయనకే వచ్చిందట. కానీ, సరిగ్గా అదే సమయంలో నడిగర్ సంఘం ఎన్నికలు ఉండటంతో తప్పుకున్నట్లు వివరించాడు.

అయితే ఇకపై ఇలా జరగబోదని, నటనకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాననీ, వరుస సినిమాలు చేస్తానని చెప్పారు. ప్రస్తుతం తమిళ్ తో పాటు కన్నడ మూవీలో చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం జీవీ ప్రకాశ్ అప్ కమింగ్ మూవీ ‘అడంగతే’ లో ఓ కీలకపాత్ర షోషిస్తున్న ఆయన అందులో క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుందని చెబుతున్నాడు. మంచి ఛాన్సులు వస్తే తెలుగు తెరపై కూడా కనిపిస్తానని అంటున్నాడీ మ్యాన్లీ హీరో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Sarathkumar  Back to Movies  sarathkumar  

Other Articles