జ్యో అచ్యుతానంద హిట్ తో వారి కెరీర్లు సేఫ్ | Jyo Achyutananda positive reviews helps to those carrier

Jyo Achyutananda positive review, Jyo Achyutananda turns those carrier, Jyo Achyutananda screens increased, Jyo Achyutananda hit talk

Jyo Achyutananda positive reviews and hit talk helps to those carrier, and increase screens.

ఒక్క సినిమాతో ఇంతమందికి...

Posted: 09/10/2016 11:40 AM IST

పెద్ద సినిమాలు వరుసగా దెబ్బేస్తున్న టైంలో చిన్న సినిమాలు టాలీవుడ్ కి రిఫ్రెష్ మెంట్ ఫీలింగ్ ను అందించడం, కలెక్షన్లపరంగా కుమ్ముకోవడమే కాదు, వారి వారి కెరీర్ లకు మంచి లైఫ్ ని ఇస్తున్నాయి. ఈ యేడాది ఫలితాలను చూసుకుంటే డిక్టేటర్, సర్దార్, బ్రహ్మోత్సవం సినిమాలు చేదు జ్నాపకాలను మిగిలిస్తే... కృష్ణగాడి వీరప్రేమగాథ, క్షణం, జెంటిల్మెన్, అ..ఆ..., డబ్బింగ్ సినిమాగా వచ్చిన బిచ్చగాడు, పెళ్లి చూపులు ఇలా థియేటర్లను ఫుల్ ప్యాక్ తో రన్ చేశాయి.

తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరింది శ్రీనివాస్ అవసరాల డైరక్షన్ లో వచ్చిన జ్యో అచ్యుతానంద. అన్నదమ్ముల రిలేషన్ షిప్ ప్రధానంగా వచ్చిన ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ రివ్యూ ఇప్పుడు ఆడియన్స్ ని థియేటర్లకి క్యూ కట్టేలా చేస్తోంది. నారా రోహిత్, నాగ శౌర్య యాక్టింగ్ లతోపాటు, దోసెడు నవ్వులు, చిటికెడు కన్నీళ్లు అంటూ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి మౌత్ టాక్ తో రెండో రోజుకే స్క్రీన్ల సంఖ్యను పెంచేసుకుంది. అంతేకాదు చాలా మంది కెరీర్ కు ఈ హిట్ సాయపడింది.

ముందుగా డైరక్టర్ల ద్వితియ విఘ్నం సెంటిమెంట్ ను అధిగమించి అవసరాల హిట్ సాధించాడనే అనుకోవచ్చు. మరోవైపు మంచి టేస్టున్న నిర్మాతగా గుర్తింపున్న సాయి కొర్రపాటికి కూడా గత కొంతకాలంగా సరైన విజయాల్లేవు. తుంగభద్ర.. రాజా చెయ్యి వేస్తే నిరాశనే కలిగించాయి. తాజాగా ‘మనమంతా’కు క్రిటిక్స్ అభినందనలు దొరికినా డబ్బులు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ‘జ్యో అచ్యుతానంద’ ప్రశంసలతో పాటు డబ్బులూ తెచ్చిపెట్టేలా ఉంది. మరోవైపు నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా.లతోపాటు మ్యూజిక్ డైరక్టర్ కళ్యాణ రమణ(కళ్యాణ్ మాలిక్) లకు ఇలా చాలా మందికి సక్సెస్ చాలా అవసరం అనుకుంటున్న సమయంలో భలేగా వచ్చిపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyo Achyutananda  positive reviews  screens  increase  

Other Articles