సౌత్ లో ఇప్పుడు మోస్ట్ డిస్కసింగ్ చిత్రంగా మారిపోయింది మహేష్ అప్ కమింగ్ మూవీ. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొనగా, షూటింగ్ నుంచి గోప్యత ప్రదర్శించడటంతో అవి ఇంకా రెట్టింపు అవుతున్నాయి. ఇక బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లని ప్రచారం జరుగుతుండం విశేషం.
ఈ విషయమై మురగదాస్ ను ప్రశ్నిస్తే ఆయన సూటిగా సమాధానం ఇవ్వట్లేదు. "షూటింగ్ ఇప్పుడే కదా మొదలెట్టాం. అప్పుడే ఖర్చు ఎంత అవుతుందంటే ఎలా చెప్పగలం. చివరికొచ్చాక బడ్జెట్టు ఏమిటనేది తేలుతుంది. ఆ లెక్కలన్నీ ఆఖరులోనే తేలతాయి" అన్నాడు నవ్వుతూ. మామూలుగా ఎవరైనా ఒక బడ్జెట్టు వేసుకునే సినిమా మొదలెడతారు. దానికి కాస్త అటు ఇటుగా లెక్కతేలుతుంది. మరి, మురుగదాస్ మాటలను చూస్తుంటే మాత్రం అది మించిపోయేలాగానే ఉంది.
ఇక ఈ చిత్రం కోసం మహేష్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడని ఇది వరకే చెప్పుకున్నాం. మహేష్ ఓ ప్రత్యేకమైన నటుడు. ఏ విషయానైనా కేవలం వినటం ద్వారానే గుర్తుంచుకుంటాడు అని చెప్పుకొచ్చాడు. ఫిట్ బాడీతో ఆఫ్ షర్ట్స్ టక్ చేసుకున్న ఫోటోలు కొన్ని లీకయ్యాయి కూడా. ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ ఏంటంటే... తమిళ్ లో కూడా మహేష్ సొంతంగా డబ్బింగ్ చెప్పబోతున్నాడంట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more