భారీ గ్రాఫిక్స్ తో దీపావళికి రోబో సీక్వెల్ మార్పు | Rajinikanth's Robo 2.0 shifts to Diwali 2017

Rajinikanth s robo 2 0 shifts to diwali 2017

Rajinikanth's Robo 2.0 release date, Robo 2.0 updates, Robo 2.0 shifts to Diwali, Robo 2.0 2017

Due to heavy graphics Rajinikanth's Robo 2.0 release date shifts to Diwali 2017.

భారీ గ్రాఫిక్స్ దెబ్బ తీస్తున్నాయంట

Posted: 08/25/2016 06:10 PM IST
Rajinikanth s robo 2 0 shifts to diwali 2017

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీగా రోబో సీక్వెల్ రోబో 2.0. షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దేశంలోనే ఇంతవరకు తెరకెక్కించని రీతిలో భారీ బడ్జెట్ తో శంకర్ దీనిని రూపొందిస్తున్నాడు. ఇందుకోసం విదేశీ టెక్నిషియన్స్ ను తీసుకుని నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నాడు. మూడు నెలలుగా రజనీ లేకుండానే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ తలైవా జాయిన్ అయ్యాడు కూడా.

ప్రస్తుతం రజనీకాంత్ పై ల్యాబ్ లో వచ్చే కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నాడు శంకర్. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఈ చిత్రాన్ని సమ్మర్ కి రిలీజ్ చేయాలని భావించిన చిత్ర యూనిట్ కి ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. ముందుగా గ్రాఫిక్స్ పని కోసం ఒప్పందం కుదర్చున్న హాలీవుడ్ టెక్నీషియన్ టీం మూడు నెలల్లో మొత్తం పని పూర్తి చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే భారీ గ్రాఫిక్స్ సన్నివేశాలతో రూపొందించాల్సి రావటంతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తేల్చేసిందట. దీంతో చిత్రం మరో నాలుగు నెలలు వాయిదా పడటం ఖాయమని తేలింది.

చిత్ర యూనిట్ లైకా ప్రోడక్షన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2017 దీపావళికి ఈ చిత్రం విడుదల చేయాలని చూస్తున్నారంట. రజనీ సరసన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Robo 2.0  release date  Diwali 2017  

Other Articles