కట్టప్ప బాహుబలిని చంపే సీన్ చిత్రీకరణ | Rajamouli shoot Kattappa killing baahubali scene secretly

Rajamouli shoot kattappa killing baahubali scene secretly

Rajamouli shoot Kattappa killing baahubali scene, Kattappa killing Baahubali, Why Kattappa killing Baahubali, secret of the year shooting secretly, Rajamouli shoot Kattappa killing baahubali

Rajamouli shoot Kattappa killing baahubali scene secretly, producer yarlagadda also in that shoot.

బాహుబలి సీక్రెట్ షూటింగ్ దేనికోసం...

Posted: 08/25/2016 06:03 PM IST
Rajamouli shoot kattappa killing baahubali scene secretly

బాహుబలి సీక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురు చూసేది ఎందుకోసమంటే... సింపుల్ గా ‘వై కట్టప్ప కిల్ బాహుబలి?’ అన్న ప్రశ్నకు సమాధానం కోసమేనన్న ఆన్సర్ వినిపిస్తోంది. సిల్లీగా జోకులతో మొదలైన ఈ ప్రశ్న ఇప్పుడు సినిమా కోసం సీరియస్ గా ఎదురు చూసే స్థాయికి తీసుకొచ్చింది. ఇక ఈ టాప్ సీక్రెట్ ను రివీల్ కాకుండా జక్కన్న బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న సీన్ ను అత్యంత గోప్యంగా సీన్ షూటింగ్ చేశాడంట.

మొదటి పార్ట్ కోసం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సన్నివేశాలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండో పార్ట్ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎటువంటి లీకులు రాకుండా చూసుకుంటున్నాడంట. ఈ మూవీ కోసం పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేకంగా ఐడెంటీ కార్డులు ఇవ్వటం, వారి దగ్గర మొబైళ్లు లేకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్ సన్నివేశంను టాప్ సీక్రెట్ గా చిత్రీకరణ చేశాడని సమాచారం.

బాహుబలి, కట్టప్ప ఇద్దరితోపాటు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ మాత్రమే ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా అక్కడ ఉన్నారంట. చివరికి చిత్రీకరించే ఆ సీన్ బాహుబలిని, కట్టప్పను కూడా కాస్త అయోమయంలో పడేసిందటే ఎంత గోప్యంగా తీశాడో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది రాజమౌళి, రచయిత విజయేంద్రప్రసాద్ కి మాత్రమే. ఇప్పుడు మూడో వ్యక్తిగా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆ జాబితాలోకి చేరిపోయారు. అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.. వందల కోట్లు పెడుతున్నారు కదా ఆ మాత్రం జాగ్రత్త పడట తప్పులేదు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Kattappa  kills  baahubali  scene  shoot  

Other Articles