మన ఊరి రామాయణం టీజర్ విడుదల | Prakash raj Mana Oori Ramayanam teaser released

Prakash raj mana oori ramayanam teaser released

Prakash raj Mana Oori Ramayanam, Priyamani in Mana Oori ramayanam, Mana Oori Ramayanam teaser

Prakash raj Mana Oori Ramayanam teaser released.

ప్రకాశ్ రాజ్ భుజంగయ్య గోల

Posted: 08/13/2016 01:16 PM IST
Prakash raj mana oori ramayanam teaser released

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మంచి అభిరుచి కలిగిన దర్శక నిర్మాత కూడా. కమర్షియల్ అంశాలు లేకపోయినా, చిత్రాల ఫలితం ఎలా ఉన్నా ఆయన సినిమాలో కంటెంట్ మాత్రం బాగానే ఉంటుంది. గత కొద్దీకాలంగా సినిమాలు బాగా తగ్గించేసిన ఈ మోనార్క్  సొంత ప్రాజెక్టు దర్శకత్వంలో తెగ బిజీ అయిపోయాడు. అదే మన ఊరి రామాయణం.

సందేశాన్ని మేళవిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. భుజంగయ్య దుబాయి నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తి. తన ఊర్లో జరిగే శ్రీరామనవమి ఏర్పాట్లకు ఖర్చుపెట్టడమే కాదు, దగ్గరుండి వాటిని చూసుకుంటాడు కూడా. అయితే అనుకోకుండా జరిగిన ఓ ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అది ఏంటీ? అన్నదే కథ. ప్రతి మనిషిలో ఒక రాముడు ఒక రావణుడు ఉంటాడన్న కాన్సెప్ట్ తో ఇది తీర్చిదిద్దాడు. .

తెలుగు .. కన్నడ భాషల్లో ఆయన ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకి సంబంధించిన చాలా భాగం షూటింగ్ హైదరాబాద్ లోను .. 'కూర్గ్' లోను జరిపారు. ప్రియమణి వ్యాంప్ తరహా క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash raj  Mana Oori Ramayanam  teaser  

Other Articles