ధోనీ బయపిక్ ట్రైలర్ వచ్చేసింది | Dhoni bio pic trailer released

Dhoni bio pic trailer released

Dhoni bio pic trailer, Dhoni trailer, Dhoni sushanth singh rajput, Dhoni the untold story, Dhoni bio pic, Dhoni movie, Dhoni trailer

Indian ODI captain Dhoni biopic M.S.Dhoni - The Untold Story Official Trailer released.

ట్రైలర్ : ధోనీ తెలియని ప్రయాణం

Posted: 08/12/2016 11:16 AM IST
Dhoni bio pic trailer released

అన్ని ఫార్మట్ లలో టీమిండియా జట్టును జగత్ విజేతగా నిలబెట్టిన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ బయెపిక్ ట్రైలర్ విడుదలైంది. వెడ్నస్ డే.. స్పెషల్ చబ్బీస్.. బేబీ లాంటి మాంచి సినిమాలు తీసిన నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకుడు. ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్, భూమికా చావ్లా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.

టీమిండియాకు ప్రపంచ కప్ లను అందించటంతోపాటు, నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ధోనీ గురించి అందరికీ తెలుసు. కొన్నాళ్లు రైల్వే టీసీగా పని చేశాడని కూడా ఇంకొత మందికి తెలుసు. కానీ, అంతకు ముందు అతనేంటి? జార్ఖండ్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో, ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన ధోనీ ఇప్పుడు ఈ స్థాయికి ఎలా చేరాడు తదితర విషయాలను ఇందులో చూపించారు. ట్రైలర్ విషయానికొస్తే... మీకు తెలిసిన వ్యక్తి.. మీకు తెలియని ప్రయాణం.. అనేది స్టోరీ లైన్.

అసలు ధోనీ లైఫ్ ఏంటి? పుట్ బాల్ ఆట నుంచి క్రికెట్ కు ఎలా మళ్లాడు. ఫ్యామిలీ కోసం రైల్వే టీసీ గా ఎందుకు మారాల్సి వచ్చింది. అక్కడ క్రికెట్ గురించి ఆలోచన అతన్ని ఎలా వేధించింది. చివరకు ఎవరి సాయంతో అటు ఉద్యోగం, ఇటు ఆట ఎలా బ్యాలెన్స్ చేయగలిగాడు. టీమిండియా జట్టు ఎంపిక కోసం ఎదుర్కున్న కష్టాలు ఏంటి? ప్యానెల్ అతన్ని ఎలా పరిక్షించింది. ఇలాంటి విషయాలతోపాటు ఆటలో అందించిన విజయాలను కూడా చూపించారు. బాడీ లాంగ్వేజ్ తోపాటు బ్యాటింగ్ లో కూడా రాజ్ పుత్ ధోనీ శైలిని బాగానే అనుసరించాడు. దాదాపు దశాబ్దం తర్వాత భూమికా చావ్లా ఓ కీలకపాత్రలో ఈ చిత్రంలో నటిస్తోంది. ధోనీ క్రేజ్ అనుసరించి ఆయన బయోపిక్, అందులో చూపించబోయే తెలియని అంశాల గురించి ఆసక్తి నెలకొనటం సహజమే కాబట్టి చిత్రంపై కూడా అంచనాలు బాగానే ఉండనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian captain  dhoni  trailer  

Other Articles