ఆలీ హీరోగా సంజయ్ రామస్వామి | Ali back as hero with Sanjay Ramaswamy movie

Ali back as hero with sanjay ramaswamy movie

Ali Sanjay Ramaswamy

Ali back to hero as 'Sanjay Ramaswamy'. This flick comes with the tag line 'Gatham kelukkunna Ghajini'

సూర్య క్యారెక్టర్ లో ప్రముఖ కమెడియన్

Posted: 08/11/2016 05:29 PM IST
Ali back as hero with sanjay ramaswamy movie

కమెడియన్ టూ హీరోగా సక్సెస్ అయిన వాళ్లు చాలా కొద్ది మంది మాత్రమే అని చెప్పాలి. బ్రహ్మనందం, బాబు మోహన్ లాంటి సీనియర్లు కూడా హీరోలుగా సినిమాలు తీసి బోల్తాపడిన వాళ్లే. ఆపై ఆలీ, వేణు మాధవ్ లాంటి తర్వాతి తరం కమెడియన్లు కూడా హీరోలుగా మారి భంగపడ్డారు. కానీ, వీరందరిలో తాను మాత్రం లేడని నిరూపించుకున్నాడు సునీల్.

అయితే దాదాపు ముఫ్పై ఏళ్లకు పైగా కెరీర్ లో ఉన్న ఆలీ అప్పటి కమెడియన్లలో సక్సెస్ రేటును కాస్త ఎక్కువే చవిచూశారు. యమలీలతో హీరోగా మారి పిట్టలదొర, ఘటోత్కచుడు వంటి హిట్ చిత్రాలు తీశాడు. కానీ, తర్వాత వచ్చిన కొన్ని టార్చర్ చిత్రాలు హీరోగా ఆయన పనికి రాడని తేల్చేయటంతో తిరిగి కమెడియన్ గానే ఆయన మారిపోయాడు. ఆ మధ్య ఒకటి రెండు చిత్రాలు తీసిన అవీ కూడా సక్సెస్ ను రుచిచూపించలేకపోయాయి. దీంతో మరోసారి హీరోగా ఆయన ట్రయల్ వేయనున్నాడని తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గజిని సినిమా గుర్తుంది కదా. అందులో హీరో సూర్య పాత్ర పేరు సంజయ్ రామస్వామి అని అందరికీ తెలిసే ఉంటుంది.  సరిగ్గా అదే పేరుతో ఇప్పుడు ఆలీ హీరోగా ఓ సినిమా రాబోతుంది.   'సంజయ్ రామస్వామి' .. 'గతం కెలుక్కున్న గజిని' అనేది ట్యాగ్ లైన్ కొత్త దర్శకుడు నాగు గవర ఈ సినిమా తీయబోతున్నాడు.  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు తెలియజేసి, పట్టాలెక్కించునున్నారు. ఈ అవుట్ డేటెడ్ ఏజ్ లో ఈ స్టార్ కమెడియన్ వేసే హీరో వేషాలు ఎవరైనా చూస్తారంటారా?.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ali  Ali Sanjay Ramaswamy  Surya  

Other Articles