విదేశీ చిత్రాల కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయిన రుద్రమదేవి | Rudramadevi recommand for Oscar in Best Foreign launguage film category

Rudramadevi recommand for oscar in best foreign launguage film category

gunasekhar, tweet, rudramadevi, oscar, Best Foreign launguage film

Gunasekhar happy over Rudramadevi recommand for Oscar. Film Federation of India Recommends Rudramadevi for Oscar Award in the category of Best Foreign Language category.

అస్కార్ బరిలో రుద్రమదేవి

Posted: 08/11/2016 03:09 PM IST
Rudramadevi recommand for oscar in best foreign launguage film category

తన ఆస్తులన్నీ తాకట్టుపెట్టి వ్యయ ప్రయాసలకూడ్చి భారీ బడ్జెట్ తో రుద్రమదేవిని తెరకెక్కించాడు దర్శకుడు గుణశేఖర్. ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన రుద్రమదేవి జీవితచరిత్రనే సినిమాగా ఎంచుకుని, ఏడేళ్లు పరిశోధనలు చేసి శ్రమించి తీస్తున్నాడు అనగానే రిస్క్ చేస్తున్నాడని అన్నవారంతా... రిలీజ్ అయ్యాక ఆయన చేసిన పనే కరెక్ట్ అని పొగడకుండా ఉండలేకపోయారు.

విడుదలకు ముందు ఆర్థిక సమస్యలు వెంటాడిన సరే వాటన్నింటిని దాటి, అందరి మద్ధతులో విడుదల చేయించుకోగలిగి లాభాలను ఆర్జించాడు. లీడ్ పాత్రలో అనుష్క, చాళుక్య వీరభద్రుడిగా రానా నటించగా, కీలకమైన గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ సినిమాకు ప్రాణం పోయటమే కాదు. జనాలు థియేటర్లకు రావటానికి ముఖ్యకారణం అయ్యాడు. కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్ లాంటి హేమాహేమీలతోపాటు నిత్యామీనన్, కేథరిన్ లు ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా, కాకతీయ సామ్రాజ్యపు వైభవాన్ని చాటి చెప్పింది.

అనుష్క-గుణశేఖర్ వీరిద్దరి కెరియర్ లో చెప్పుకోదగిన చిత్రంగా 'రుద్రమదేవి' నిలిచింది. అలాంటి ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరి కింద 'రుద్రమదేవి'ని ఆస్కార్ అవార్డులకు పంపించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా గుణశేఖర్ తెలియజేస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gunasekhar  tweet  rudramadevi  oscar  Best Foreign launguage film  

Other Articles