నేను లోకల్ చిత్ర షూటింగ్ ప్రారంభం | nani nenu local movie launched

Nani nenu local movie launched

Nani Nenu local, Nani Keerthi Suresh, Nani new movie opening, nani dil raju movie launch, dil raju about nani, nenu local telugu movie

Nani Nenu local Shooting Started. Keerthi Suresh actress, Dil Raju producer and Trinatha Rao directed.

కాస్త గ్యాప్ ఇవ్వవయ్యా బాబు

Posted: 08/10/2016 06:43 PM IST
Nani nenu local movie launched


నేచురల్ స్టార్ హవా గతేడాది రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో అనుకుంటే... ఈ యేడాది సగంలోపే మరో రెండు కొట్టేశాడు. ఇక ఇప్పుడు మరో రెండు రిలీజ్ కు రెడీ చేసుకుంటున్నాడు. అందులో ఒకటి విరించి వర్మ మజ్ను కాగా, మరోకటి నేను లోకల్ లోకల్. మజ్ను సెప్టెంబర్ లో రిలీజ్ కు రెడీ అయిపోతుంటే, నేను లోకల్ ను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

సినిమా చూపిస్త మావ ఫేమ్ త్రినాథరావు దర్శకత్వంలో 'నేను లోకల్' సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో షూటింగ్ షురూ అయ్యింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాని జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా నాయకా నాయకిలపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మూడు నెలలో ముగించేసి చివర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

వరుసగా నాలుగు హిట్లు కొట్టిన తరువాత నాని చేస్తోన్న సినిమా, పైగా 'నేను శైలజ' సక్సెస్ తరువాత కీర్తి సురేష్ నటిస్తున్న రెండో చిత్రం, అలాగే. 'సినిమా చూపిస్త మావ'తో తొలిచిత్రంతోనే హిట్ అందుకున్న త్రినాథరావు తెరకెక్కిస్తుండటం, పైగా దిల్ రాజు నిర్మాత కావటం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  nenu local  shooting  start  Keerthi Suresh  Dil Raju  Trinatha Rao  

Other Articles