పవన్ డాలీ సినిమాకి ట్రయల్ షెడ్యూల్ | pawan dolly movie first schedule only two days

Pawan dolly movie first schedule only two days

Pawan Dolly movie first schedule , Pawan follows sentiment for Dolly movie, Dolly and Pawan Movie, Pawan joins in shooting, pawan new movie shooting, pawan in dolly movie sets

Pawan Dolly movie first schedule only two days

సెంటిమెంట్ ను ఫాలో అవుతూనే...

Posted: 08/06/2016 12:05 PM IST
Pawan dolly movie first schedule only two days

పవన్ కళ్యాణ్ కొత్త చిత్ర షూటింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. సెంటి మెంట్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ లో పవన్ పాల్గొనడని, తర్వాత జరిగే దాంట్లోనే పాల్గొంటాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో నెలపాటు పవర్ స్టార్ మేకప్ వేసుకోడని, తద్వారా సినిమా లేటయ్యే ఛాన్సుందని అభిమానులంతా నిరాశపడిపోయారు. అయితే వారందరికీ బూస్ట్ ఇచ్చే వార్త ఒకటి వినిపిస్తోంది.

గతంలో పవన్ లేకుండానే ఆయా చిత్రాల దర్శకులు రెండు, మూడు వారాలపాటు దర్శకులు షూటింగ్ నిర్వహించేవారు. అయితే ఆ మేజర్ పార్ట్ అంతా పవన్ లేకపోవటంతో ఎడిటింగ్ లోనే ఎగిరి పోయేది. తద్వారా టైం వేస్ట్ తోపాటు, ప్రొడ్యూసర్ కి అనవసరమైన ఖర్చు జరిగేది. దీంతో ఈ సారి పవన్ కొత్తగా ఆలోచన చేశాడని తెలుస్తోంది.

ట్రయల్ రన్ పేరుతో ఆ రెండు రోజులు తూతూ మంత్రంగా పని కానిచ్చేసి ఈ నెలాఖరుకు మేజర్ షెడ్యూల్ మొదలు పెట్టి 5 నెలలో సినిమా పూర్తిచేయాలని పవన్ యోచిస్తున్నాడు. ఓవైపు సెంటిమెంట్ ఫాలోఅయిపోతూనే, టైమ్, మనీ వేస్ట్ కాకుండా షూటింగ్ లో పాల్గొనాలన్నదే ఫ్లాన్. అంటే డాలి దర్శకత్వంలో ఫస్ట్ షెడ్యూల్ ముహుర్తం షాట్ అండ్ కొన్ని సన్నివేశాలతోనే తూతూగా జరిగిపోనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతీహాసన్ కథానాయికగా అనుకుంటున్నారు. శరత్ మరార్ నిర్మాత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Dolly  New Movie  first shedule  

Other Articles