సుశాంత్ ఆటాడుకుందాం రా విడుదల తేదీ ఖరారు | sushanth atadukundam ra release date confirmed

Sushanth atadukundam ra release date confirmed

Sushanth movie depends on thikka, Atadukundam ra thikka, thikka troubles for akkineni hero, Atadukundam ra director

sushanth atadukundam ra release date confirmed.

మెగా ప్లేసులోకి అక్కినేని హీరో!

Posted: 08/04/2016 05:17 PM IST
Sushanth atadukundam ra release date confirmed

ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా రానున్న రెండు నెలలు మొత్తం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దసరాకు ఇప్పటికే కొన్ని బడా చిత్రాలు డేట్లు బుక్ చేసుకోవటంతో ఈ గ్యాప్ లో చిన్న సినిమాలన్నింటిని విడుదల చేసుకోవాలని ఫ్లాన్ వేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ ఒక్క ఆగష్టులోనే దాదాపు 10పైగా సినిమాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మనమంతా, శ్రీరస్తు శుభమస్తు ఈ శుక్రవారమే విడుదలవుతూ ఈ లిస్ట్ లో ముందుండగా, ఆ తర్వాతి వారంలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి. అవి తిక్క, చుట్టలబ్బాయి.

ఆది నటించిన చుట్టాలబ్బాయి రిలీజ్ ఇంకా కన్ఫర్మ్ చేసుకోనప్పటికీ, ఈ రేసులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆగష్టు 13న తన తిక్కను చూపేందుకు సిద్ధమైపోయాడని కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. కారణాలేంటో తెలియకపోయినప్పటికీ తిక్కను కొద్దిరోజులు పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారంట. దీనిపై అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ గ్యాప్ లో ఎక్కడి నుంచి దూరాడో తెలీదు అక్కినేని వారసుడు సుశాంత్ తన ఆటాడుకుందాం రా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరెకక్కిన ఆటాడుకుందాం రా కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టి తీసి, సెన్సార్ కోసం ఫస్ట్ కాపీని చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. ఒకవేళ తిక్క గనక పోస్ట్ పోన్ అయితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆ డేట్ ను వదులుకోవద్దని నిర్మాతలు భావిస్తున్నారు. ఏదేమైనా ఆగష్టు 5న అక్కినేని ఫ్యామిలీ సమక్షంలో జరగబోయే ఆటాడుకుందాం రా ఆడియో పంక్షన్ లో ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో సోనమ్‌ ప్రీత్‌ బజ్వా కథానాయికగా నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atadukundam ra  Naga Sushanth  release  date  

Other Articles