పెళ్లయ్యాక బికినీలో హాట్ గా బిపాసా | Bikini Pictures Of Bipasha Basu From Her Bali Vacation.

Bikini pictures of bipasha basu from her bali vacation

Bipasha Basu honey moon, Bipasha Basu shared her bikini pictures, Bipasa Bikini photos, Bipasha after marriage, Bipasha honey moon pics

Bipasha Basu shared her bikini pictures From Bali Vacation.

పెళ్లయ్యాక బికినీలో మరింత హాట్ గా...

Posted: 08/04/2016 01:14 PM IST
Bikini pictures of bipasha basu from her bali vacation

కొందరు సినిమాల్లో ఉన్నా లేకపోయినా సంచలనంగానే ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాసాబసు ఒకరు. జాన్ అబ్రహంతో ఏళ్లకు ఏళ్లు ప్రేమాయణం నడిపి, పబ్లిక్ గా రొమాన్సులు చేసి అప్పట్లో వార్తల్లో బాగా నానింది. అయితే అది గతం అనుకోండి. ఈ మధ్యే ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో మూడు ముళ్లు వేయించుకుని హ్యాపీగా హానీమూన్ చెక్కేసింది.

ప్రస్తుతం ఈ జంట ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తోంది. అక్కడి సముద్ర తీరంలో ఏకాంతంగా గడుపుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో హడావుడి చేసే బిపాసా హనీమూన్ సెల్ఫీలను కూడా అప్ లోడ్ చేసేస్తోంది. అందులో ఆమె అవతారం చూస్తే మతిపోవటం ఖాయం.

ఏకంగా బికినీలో దిగిన స్టిల్స్ పెట్టేసింది. పెళ్లికి ముందు సినిమాల్లో హాట్ సీన్ లలో నటించినప్పటికీ పెద్దగా ఆకట్టుకునేది కాదు. కానీ, ఇప్పుడు పెళ్లయ్యాక కూడా బిికినీలో యమ హాటుగా కనిపిస్తున్న బిపాసాను చూస్తే ఆ అందం పెరిగినట్లు అనిపించకమానదు. ప్రస్తుతానికి సినిమాల్లో తిరిగి నటించడంపై తేల్చనప్పటికీ హానీమూన్ ముగిసి ఇండియాకు వచ్చాక మాత్రం నిర్మాణ సంస్థ ప్రారంభించబోతుందని సన్నిహితులు చెబుతున్నారు. నెలలు గడుస్తున్న వాళ్ల హానీమూన్ ఎప్పటికి ముగుస్తోందోనని ఆ ఫోటోలు చూసిన వాళ్లు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bipasha Basu  Bali  Honey Moon  vacation  bikini  

Other Articles