ఉదయనిధి స్టాలిన్ తో కేథరిన్ | Catherine to pair up with Udhayanidhi Stalin under thalapathy direction

Catherine to pair up with udhayanidhi stalin

catherine tresa movie offers, Catherine to pair up with Udhayanidhi Stalin, Catherine Kollywood offer, catherine tresa big budget movie, catherine tresa tollywood offers

Catherine to pair up with Udhayanidhi Stalin under thalapathy direction.

కేథరిన్.. ఇండస్ట్రీ అంటే అంతే మరి

Posted: 08/03/2016 04:00 PM IST
Catherine to pair up with udhayanidhi stalin

సెకండ్ హీరోయిన్ అని చెప్పి మరీ సరైనోడు సినిమా కోసం కేథరిన్ తీసుకున్నాడు దర్శకుడు బోయపాటి. అలా అనే చిత్ర ప్రమోషన్లు కూడా చేశారు. కానీ, కట్ చేస్తే అక్కడ జరిగింది మరోకటి. సినిమాలో ఆమె పాత్రే ఎక్కువ సేపు కనిపించడంతోపాటు, లీడ్ హీరోయిన్ రకుల్ కంటే డామినేట్ చేసి మరీ నటించింది. దీంతో ఆ దెబ్బకి వరుస అవకాశాలు ఆమెను క్యూ కట్టేస్తున్నాయి.

ప్రస్తుతం కేథరిన్ షెడ్యూల్ మాములు బిజీగా లేదు. గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్లో వచ్చే సినిమాలో ఆమె హీరోయిన్. రానా-కాజల్ తేజ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా మరో హీరోయన్ గా కేథరిన్ నే తీసుకున్నారు. ఇదిలా ఉండగానే ఆమెకు తమిళ్ లోనూ సక్సెస్ రేటు ఎక్కువ ఉండటంతో మరో పెద్ద అవకాశమే ఆమెకు దక్కిందట.

ఓకే ఓకే సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా దళపతి దర్శకత్వంలో ఎండ్రాల్ ఫిల్మ్స్ తీయబోయే ఓ భారీ బడ్జెట్ సినిమాలో కేథరిన్ ను హీరోయిన్ గా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆ చిత్రానికి ఆమె ఒప్పేసుకుందని, డేట్లు అడ్జస్ట్ చేసే పనిలో ఉందని సన్నిహితులు చెబుతున్నారు. టాలెంట్ ఉన్న ఒక్క అవకాశం ఇచ్చేందుకు అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు... ఇప్పుడేమో వరుస ఆఫర్లతో ఎగబడిపోతున్నారు. దర్శకుల్లారా కాస్త ఆ బ్యూటీకి కాస్త ఊపిరి ఆడనివ్వండయ్యా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : catherine tresa  Udhayanidhi Stalin  thalapathy  movie  

Other Articles