అమ్మ గురించి జగపతి బాబు | jagapathi babu about his mother

Jagapathi babu about his mother

Jagapathi babu about personal, Jagapathi babu about his mother, jagapathi babu mom stop talking with him, Jagapathi babu bad habits, jagapathi babu playboy

Jagapathi babu about his mother. Says she stop talking with him several years.

మ్యాన్లీ హీరో అమ్మను ఎందుకంత భయపెట్టాడు?

Posted: 08/03/2016 10:11 AM IST
Jagapathi babu about his mother

ఇండస్ట్రీలో మ్యాన్లీ హీరోగా గుర్తింపు పొందిన జగపతి బాబు పర్సనల్ లైఫ్ వ్యవహారాలు భలేగా ఉంటాయి. లగ్జరీ లైఫ్, జూదాలకు బాగా అలవాటు పడి ఆర్థికంగా బాగా చితికిపోయానని చెప్పుకుంటున్న ఈ సీనియర్ హీరో అందుకు చాలా పశ్చాత్తాప పడుతున్నానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పటం తెలిసిందే. ఆయన ఎంజాయ్ చేసింది కాక పక్కోడి మీద కూడా లక్షలు ఖర్చుపెట్టడమే ఆయనను దెబ్బతిసిందని చెప్పుకోస్తుంటాడు.

ఓటమిని అస్సలు అంగీకరించొద్దని అమ్మ చెప్పిన మాటతో ప్రేరణ పొందిన ఆయన ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవటం లేదంట. అయితే తానెంతో ఇష్టపడే ఆమె తనతో చాలా సంవత్సరాలు మాట్లాడకపోయిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. నిజానికి అసలు ఆయన సినిమాలోకి రావటం ఆమెకు సుతరాము ఇష్టం లేదంట దీంతో కొన్ని రోజుల పాటు మాట్లాడటం మానేసిందని, ఆపై తన సిగరెట్లు, మందు అలవాటు తెలుసుకుని దాదాపు 7 ఏళ్లు ఆయన ముఖం కూడా చూడలేదని చెప్పాడు.

అంతేకాదు పై చదువుల కోసం జగ్గూని అమెరికా పంపాలని వీబీ రాజేంద్ర ప్రసాద్ ఆలోచన చేస్తే... వీడు అక్కడికి వెళ్లితే కనీసం రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడన్న విషయాన్ని ఆయనకు చెప్పి, భయంతో అసలు అందుకు ఒప్పకోలేదంట. అంతలా నమ్మకం పెరిగిపోయిందట జగ్గూభాయ్ మీద వాళ్ల అమ్మకి. ఏదేమైనా చెడు అలవాట్లకు స్వస్తి చెప్పటంతోపాటు ఇప్పుడు సౌత్ లో మాంచి పోజిషన్ లో ఉన్న తన కొడుకును చూసి ఆమె ఖచ్ఛితంగా మురిసిపోదంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi babu  mother  stop talking  bad habits  

Other Articles

Today on Telugu Wishesh