తారకరత్న కాకతీయుడు రిలీజ్ డేట్ ఖరారు | Tarakratna Kakatheeyudu got release date

Tarakratna kakatheeyudu got release date

Nandamuri Tarakratna Kakatheeyudu got release date. Released on August 5th.

Nandamuri Tarakratna Kakatheeyudu got release date. Released on August 5th.

ఆ సినిమా ఇంకా బతికే ఉందా?

Posted: 08/02/2016 10:25 AM IST
Tarakratna kakatheeyudu got release date

నందమూరి నటవారసుల్లో అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాకుండా తారకరత్న అనే మరో నటుడు కూడా ఉన్నాడన్న సంగతి మళ్లీ చాన్నాళ్లకు జనాలకు గుర్తోచ్చింది అయితే ఈ మధ్యే నారా రోహిత్ రాజా చెయ్యివేస్తే చిత్రంలో విలన్ గా నటించాడు. నటనపరంగా మంచి మార్కులే పడ్డప్పటికీ తారక్ సుడి మాత్రం తిరగలేదు.  

అయితే ఏమనిపించిందో ఏమో మళ్లీ తన పాత చిత్రాలకు పట్టిన చెదలును దులుపుతున్నాడు. అతగాడు అప్పుడెప్పుడో నటించిన కాకతీయుడు అనే ఓ చిత్రం  సినిమాను ఇప్పుడు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. వి.సముద్ర తెరకెక్కించిన ఈ చిత్రం  నాలుగైదేళ్లు షూటింగ్ జరుపుకుంది. ముక్కు ముఖం తెలీని కాస్ట్ తోపాటు ప్రభ, నాగినీడు లాంటి ప్రముఖ నటులు కూడా ఇందులో ఉన్నారు. ఆ మధ్యలో ఆడియో రిలీజ్ చేసి చేతులు కూడా దులుపుకున్నాడు. ట్రైలర్ అయితే మరీ భీభత్సం. ప్రస్తుతం ఆగష్టు 5న ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నాడు.

అదే రోజున మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మనమంతా, అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు దొరకటం మాట అటుంచి అసలు ఆ సినిమాను చూసే జనాలు కూడా ఉంటారా అన్న ఆలోచన చేయకపోవటం విశేషం. అన్నట్లు మనమంతా లో కూడా తారక్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇలా ఒకేరోజు తన రెండు చిత్రాలు విడుదల కావటం కాకతాళీయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Tarakratna  Kakatheeyudu  August 5th  release  

Other Articles