మహేష్-మురగదాస్ సినిమా గురించి రకుల్ | rakul about mahesh murugadoss movie

Rakul about mahesh murugadoss movie

Rakul preet Singh about mahesh, rakul about mahesh movie, rakul about Murugadoss, rakul about mahesh movie charactrer, rakul lucky girl

Rakul preet Singh about mahesh-Murugadoss Movie.

రకుల్ ఆనందంలో అస్సలు తప్పులేదు

Posted: 08/01/2016 12:20 PM IST
Rakul about mahesh murugadoss movie

కొందరికి అవకాశాలు వెంటపడుతున్నా రావు... కానీ, మరికొందరికి అదృష్టం అనుకోకుండా తలుపుతడుతుంది. కానీ, టాలీవుడ్ బ్యూటీ రకుల్ పరిస్థితి మరోలాంటిది. సూపర్ స్టార్ మహేష్ తో గతంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయితేనేం ఏరీ కోరి మరోసారి అవకాశం ఆమెనే వెతుకుంటూ వచ్చింది. మురగదాస్ డైరక్షన్ లో మహేష్ బాబు నటించబోయే చిత్రంలో కథానాయికగా ఎంపికయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రకుల్ చెబుతున్న ముచ్చట్లు...

వాస్తవానికి ఈ సినిమా తనకు దక్కదని రకుల్ అనుకుందట. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే చర్చ బాగా జరిగింది. హీరోయిన్లలో నా పేరు కూడా వినిపించింది. ఫైనల్ గా పరిణీతి చోప్రాని తీసుకున్నారనే వార్త కూడా వచ్చింది. దీంతో ఈ సినిమా అవకాశం నాకు దక్కదనుకుని డల్ అయిపోయా. కానీ, తర్వాత నా పేరుని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. చాలా ఆత్రుతగా ఎదురు చూశా.

ధృవ చిత్రం షూటింగ్ కోసం కశ్మీర్ లో ఉన్నప్పుడు నన్ను సెలక్ట్ చేశారనే ఫోన్ కాల్ వచ్చినప్పుడు అంతే ఆనందం పట్టలేకపోయాను. ముందు నా కాళ్లు చేతులు వణికాయి. ఆపై ఆనందంతో ఒక్కసారి ఎగిరి గంతేసా. కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నాను. మురుగదాస్ సామాన్యమైన దర్శకుడు కాదు... ఆయన కథలు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. అన్ని వయసులవాళ్లూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. ఇక మహేశ్‌బాబు నా ఫేవరెట్. ఎప్పటి నుంచో నటించాలన్నదే నా కల. అది ఇలా నెరవేరింది. థ్యాంక్ గాడ్ అంటోంది.

ఈ చిత్ర షూటింగ్ మూడు రోజుల క్రితం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే రకుల్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఆరంభం కాలేదట. ప్రస్తుతం తన పాత్ర కోసం కసరత్తులు చేస్తూ... త్వరలోనే షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమైపోతుంది రకుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh  mahesh babu  murugadoss  vascodagama  

Other Articles