వేశ్యగా వర్మ హీరోయిన్ | Anaika Soti turns Prostitute for Semma Botha Aagatha

Anaika soti turns prostitute for semma botha aagatha

Varma heroine in prostitution, Anaika Soti turns Prostitute, Semma Botha Aagatha hot, Semma Botha Aagatha actress, Anaika Soti kollywood movie

Anaika Soti turns Prostitute for Semma Botha Aagatha.

వ్యభిచారంలో పడిపోయిన మరో నటి

Posted: 07/30/2016 09:43 AM IST
Anaika soti turns prostitute for semma botha aagatha

సినిమా ఆఫర్లు తగ్గిపోవటం ఏ క్యారెక్టర్ చేసేందుకయినా వర్తమాన హీరోయిన్లు సిద్ధమైపోతున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా నటించేస్తున్నారు. ముఖ్యంగా వేశ్య పాత్రలకు మంచి ఆదరణ ఉండటంతో ముందు వెనకా ఆలోచించకుండా ఒప్పేసుకుంటున్నారు. అనుష్కలాంటి స్టార్ హీరోయినే కాదు, హరిప్రియ లాంటి ఓ మాదిరి నటీమణలు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవించేసిన వారే. తాజాగా వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఓ హీరోయిన్ ఈ జాబితాలోకి చేరిపోయింది.

వర్మ సత్య-2 ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనైక సోథీ ప్రస్తుతం తమిళంలో బిజీ హీరోయిన్ గా మారింది. ఆ మధ్య సిద్ధార్థ హీరోగా వచ్చిన కావ్య తలైవన్ హిట్ కావటం, అందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయినా అవకాశాలు మాత్రం రాలేదు. తిరిగి 365 డేస్ అనే చిత్రంతో వర్మ మళ్లీ తెలుగులో ఆమెతో నటింపజేసిన అది ఆడలేదు. కానీ, కోలీవుడ్ లోనే ఆమెను మరో అవకాశం పలకరించినట్లు సమాచారం.

బాణా కత్తడి ఫేం బద్రీ వెంకటేష్ ప్రస్తుతం సెమ్మ బోతె అగతా అనే చిత్రం తీస్తున్నాడు. డిమోంటీ కాలనీ చిత్రాన్ని నిర్మించిన అధర్వ ఈ చిత్రం ద్వారా హీరోగా మారబోతున్నాడు. ఇతని పక్కన హీరోయిన్లుగా అనైక సోథీ, మిస్తీ చక్రవర్తి(చిన్నదాన నీకోసం ఫేమ్) ఎంపిక చేశాడు. అయితే అనైక సోథీ ఇందులో వేశ్య పాత్రలో కనిపించనుందని చెబుతున్నారు. ఈ పాత్ర కోసం ఎంతో మంది నటీమణులను అడిగినప్పటికీ బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉండటంతో వారంతా నో చెప్పారంట. అయితే చేతిలో అవకాశాలు లేని అనైక మాత్రం అడగ్గానే ఒప్పేసుకుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram gopal varma  Anaika Soti  Semma Botha Aagatha  adharva  

Other Articles