శ్రీరస్తు శుభమస్తుకు ఆ ఇద్దరే కీలకం | prakash raj and rao ramesh key roles in Srirastu subhamastu

Prakash raj and rao ramesh key roles in srirastu subhamastu

prakash raj and rao ramesh in Srirastu subhamastu, Srirastu subhamastu highlights, Parushram about prakash raj and rao ramesh, Srirastu subhamastu movie

prakash raj and rao ramesh key roles in Srirastu subhamastu.

ఇద్దరు విలక్షణ నటులు పోటీ పడితే...

Posted: 07/28/2016 03:14 PM IST
Prakash raj and rao ramesh key roles in srirastu subhamastu

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేయని పాత్ర అంటూ ఏదీ లేదు. క్యారెక్టర్ ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి రంజింపజేయటం ఒక్క ఆయనకే సొంతం అనే పేరు పడిపోయింది. అయితే వ్యక్తిగత బిహేవియర్ తోపాటు కొన్ని విమర్శలు ఆయన కెరీర్ ను మసకబారేలా చేశాయి. క్రమంగా పెద్ద హీరోల సినిమాల్లో కూడా కనిపించడం ఆయన మానేశారు. దీనికి కారణం రావు రమేష్ రూపంలో ఆయనకు ప్రత్యామ్నాయం దొరకడం.

కెరీర్ మొదట్లో కొన్ని చిల్లర పాత్రలు చేసిన రావు రమేష్ కరెక్ట్ పాత్ర పడితే ఏమేర రంజింపజేస్తాడో తెలుగు జనాలకు బాగా అర్థమయ్యింది. రావు గోపాలరావు తనయుడు అనే మార్క్ నుంచి, రావు రమేష్ గొప్ప నటుడు అనే స్టేజీకి ఇప్పుడు ఆయన ఎదిగిపోయారు. ఈ ఇద్దరు ఇద్దరే. గతంలో ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించిన ఎదురపడిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఈ ఇద్దరి హోరాహోరీగా నటించిన సినిమా ఒకటి త్వరలో మన ముందుకు రాబోతుంది.

అదే శ్రీరస్తు శుభమస్తు. ఇందులో వీరిద్దరూ పోటీపడి మరి నటించారంటున్నాడు దర్శకుడు పరుశ్ రామ్. ఇద్దరు గొప్ప నటులు, ఇద్దరికీ సమాన స్థాయి పాత్రలు. ఒకరికొకరు ఎదురుపడిన సన్నివేశాల్లో ఎమోషన్స్ సీన్లలో నువ్వా-నేనా అన్నట్లు నటించారని అంటున్నాడు. ఈ చిత్రం యూత్ ను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేలా తెరకెక్కించినట్టు చెప్పాడు. మొత్తానికి అల్లు శిరీష్ సక్సెస్ దాహం ఈ సినిమాతో తప్పకుండా తీరుతుందని పరుశ్ రామ్ అంటున్నాడు. ఆగష్టు 5 న ఈ చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srirastu subhamastu  prakash raj  rao ramesh  parush ram  allu sirish  

Other Articles