పవన్ డాలీ షూటింగ్ మొదలు తేదీ ఖరారు | pawan dolly movie starts on august 6th

Pawan dolly movie starts on august 6th

pawan dolly movie, sharath marrar on pawan movie, dolly pawan movie starts from, surya walk outs from pawan movie, pawan remuneration

Powerstar pawan kalyan dolly movie starts on august 6th.

పవన్ అప్ కమింగ్ అసలు ఏం జరుగుతోంది

Posted: 07/25/2016 01:50 PM IST
Pawan dolly movie starts on august 6th

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్టు పై అభిమానుల్లోనే  అనుమానాలు నెలకొంటున్నాయి. ముహుర్తం షాట్ తో లాంఛనంగా దర్శకుడు ఎస్ జే సూర్యతో ప్రారంభించిన పవన్ రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు రావటంతో అతన్ని తొలగించేయటం, ఆపై అనుహ్యంగా డాలీ పేరు తెరపైకి రావటం జరిగింది. ఇది చాలదన్నట్లు హీరోయిన్ శృతీహాసన్ మారిందని, టెక్నిషియన్స్ ను కూడా పవన్ మారుస్తున్నాడని ఇలా రకరకా ఊహాగానాల నడుమ అసలు సినిమా ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఇంతలో నిర్మాత శరత్ మరార్ చిత్రం తప్పకుండా ఉంటుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయంటూ ట్విట్టర్ లో తెలిపాడు. దీంతో అభిమానులంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మాట చెప్పి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు షూటింగ్ విషయంలో ఎలాంటి పురోగతి లేదు.  అసలు ఈ చిత్రం ఉందా? ఉంటే ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే విషయంలో ఇప్పుడు అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు.

అయితే వారందరికి ఓ హ్యపీ న్యూస్ చెబుతున్నారు మరార్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు 6న మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఆయన చెబుతున్నారు.  అంతేకాదు ఈ సినిమాలో కథానాయికగా దాదాపు శ్రుతిహాసన్ నే నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుబోతున్నాడంట. మొత్తానికి పవర్ స్టార్ అభిమానులకు బెంగ  నెలకొన్నప్పుడల్లా తానే స్వయంగా రంగంలోకి దిగి ఆల్ ఈజ్ వెల్ అని చెబుతున్నాడు నిర్మాత శరత్ మరార్.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power star  pawan kalyan  sharath marrar  dolly  shruthi hassan  

Other Articles