బిచ్చగాడు నటి మహేష్ సినిమాలోనా? | deepa ramanujam in mahesh babu mother character

Deepa ramanujam in mahesh babu mother character

deepa ramanujam in mahesh babu, bichagadu mother for mahesh, mahesh mother in vascodagama, deepa ramanujam

Bichagadu fame deepa ramanujam play mother role in mahesh-murugadoss movie.

బిచ్చగాడు నటి మహేష్ సినిమాలోనా?

Posted: 07/25/2016 04:00 PM IST
Deepa ramanujam in mahesh babu mother character

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలో తారాగణం విషయంలో అస్సలు జోక్యం చేసుకోడు. కానీ, బ్రహోత్సవం ఫలితం తేడా కొట్టడంతో ఇకపై తానే స్వయంగా పాత్రల ఎంపిక చూసుకోవాలని అనుకుంటున్నాడంట. మురుగదాస్ సలహా మేరకు రాబోయే చిత్రంలో పలువురు ప్రముఖ నటులను ఎంపిక చేసింది.  ఈ సినిమాలో మహేశ్ కి ఓ తల్లి పాత్ర ఉందట. బాగా ప్రాధాన్యత ఉండటంతో, కొంతమంది పేర్లను పరిశీలించి చివరికి బిచ్చగాడి తల్లిని ఎంపిక చేశారంట.

ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన విజయ్ ఆంటోనీ బిచ్చగాడు ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వంద రోజుల దిశగా పరుగులు తీస్తోంంది. ఇందులో తల్లి పాత్రలో  'దీపా రామానుజం' అలరించింది. తమిళంలోనే కాదు .. తెలుగులోను ఆమె పాత్రకి మంచి గుర్తింపు లభించింది. దాంతో మహేశ్ కి తల్లి పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా తరువాత దీపా రామానుజం తెలుగులోను బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. రకుల్ లీడ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, నదియా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ నెల 29న ఈ సినిమాను లాంచ్ చేస్తుండగా అదే రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని మురగదాస్ ఆలోచనలో ఉన్నాడు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  murugadoss  deepa ramanujam  bichagadu  

Other Articles