చిరుకు సారీ చెప్పిన కోదండరామిరెడ్డి | Kodandarami Reddy Apologizes Megastar

Kodandarami reddy apologizes megastar

Kodandarami Reddy comments on chiru, Kodandarami Reddy Apologizes Megastar, Kodandarami Reddy Apologizes chiru, Kodandarami Reddy sorry to chiru, Kodandarami Reddy chiru 150th movie, veteran director sorry to chiru, Kodandarami Reddy chiru

Senior Director Kodandarami Reddy Apologizes Megastar for comments on 150th Movie.

చిరుకు సారీ చెప్పిన వెటరన్ దర్శకుడు

Posted: 07/19/2016 01:43 PM IST
Kodandarami reddy apologizes megastar

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఎంపిక విషయంలో చాలా మంది చాలా కామెంట్లే చేశారు. కాపీ కథతో రావటం కన్నా కొత్త కథతో వచ్చి ఉంటే బావుండేదన్న అభిప్రాయాన్ని వర్మ లాంటి వాళ్లు వ్యక్తం చేశారు. అయితే ఆయనతో మరిచిపోలేని హిట్లు అందించాడు స్టార్ దర్శకుడు కోదండరామిరెడ్డి. అలాంటి సీనియర్ డైరక్టర్ 150వ చిత్రంపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. చిరు చేయాల్సి వస్తే కామెడీ, లవ్, యాక్షన్ డాన్స్ ఇలాంటి సబ్జెక్ట్ లతో సినిమాలే చేయాలి తప్పించి సందేశాత్మక చిత్రాలు తీస్తే ఎవరూ చూడరని అనటం తెలిసిందే. దీనిపై ఫ్యాన్స్ తో పలువురు సినీ పెద్దలు ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

ఇక వివాదం పెద్దది అవుతుందనో ఏమో రంగంలోకి దిగిన ఆయన క్షమాపణలు చెప్పారు. ఆ రోజు నేను ఏ మాట్లాడానో నాకు అస్సలు గుర్తులేదు. తర్వాతి రోజు మీడియాలో చూశాకే అసలు విషయం అర్థమైంది. ఆపై నేను ఎందుకు అలా మాట్లాడానా అని ఫీలయ్యాను. దేవుడి సాక్షిగా చెబుతున్నా.. నాకు తెలియకుండానే ఏదో ఫ్లోలో ఆ రెండు మాటలు అనేశాను. అందుకు నేను సారీ చెబుతున్నా అని ఆయన వివరణ ఇచ్చారు.

చిరంజీవి గారితో నేను చాలా సినిమాలు చేశా. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఇప్పటికీ ఉంది. నేను కూడా చాలా ఫ్లాప్ సినిమాలు తీశాను. ఫలానా జోనర్ లో తీయమని చెప్పడానికి అలా చేస్తే ఆడతాయని చెప్పడానికి నేనేమీ దేవుడిని కాదు. పొరపాటుగా మాట్లాడినందుకు చిరంజీవి గారికి, నిర్మాత చరణ్ కి, దర్శకుడు వినాయక్ కు, ముఖ్యంగా మెగాభిమానులకు పత్రికా ముఖంగా సారీ చెబుతున్నాను’ అంటు ఓ ప్రకటన ఇచ్చారు కోదండరామిరెడ్డి. దీంతో ఈ వివాదానికి ముగింపు పడినట్లే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Veteran director  Kodandarami Reddy  comment  chiru  150th movie  sorry  

Other Articles