ఎన్టీఆర్ టీజర్ రియల్ రికార్డు ఎలాగంటే... | Janatha Garaje teaser second place for pastest 2 million views

Janatha garaje teaser second place for pastest 2 million views

NTR teaser breakes record, New record for NTR janatha Garaje, janatha garaje teaser 2nd place

Janatha Garaje teaser India's second place for pastest million views.

ఎన్టీఆర్ టీజర్ రియల్ రికార్డు ఎలాగంటే...

Posted: 07/09/2016 03:40 PM IST
Janatha garaje teaser second place for pastest 2 million views

జనతా గ్యారెజ్ టీజర్ రిలీజ్ కి ముందే రికార్డులు బద్ధలు కొడుతోంది. కేవలం టీజర్ తోనే ఎన్టీఆర్ కొత్త ఫీట్ ను సాధించడం విశేషం. ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ట్రైలర్ ను ఒక్కరోజులో 14 లక్షల మంది చూడగా, తాజాగా ఎన్టీఆర్ టీజర్ ఆ రికార్డును బ్రేక్ చేసేసింది.

24 గంటల్లో కేవలం 19 లక్షల మంది జనతా గ్యారేజీ టీజర్ ను చూసేశారు. ఇంతకు ముందు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో టీజర్ కూడా 24 గంటల్లో పది లక్షల మంది వీక్షించి కొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూవర్స్ టీజర్ గా జనతా గ్యారేజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.  

ఇండియా లో టీజర్ విడుదలైన అతి తక్కువ సమయంలో కేవలం మూడు గంటల్లోనే 10 లక్షల టీజర్ గా రికార్డు సృష్టించింది రజనీ కాంత్ కబాలి. ఆ తర్వాతి ప్లేస్ లో విజయ్ తేరి 8.15 గంటలలో నిలిచింది. కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ టీజర్ మాత్రం 5.40 గంటల్లో ఒక మిలియన్ వ్యూస్ దాటి రెండో ప్లేస్ కి వెళ్లిపోయింది. అంటే ఇండియా లోనే ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూవర్స్ టీజర్ గా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెకండ్ ప్లేస్ లో నిలిచిందన్నమాట.

ఇక ఒక లక్ష తేడాతో 2 మిలియన్స్ వ్యూస్ మార్క్ ను మిస్సయిన ఎన్టీఆర్ 26 గంటల్లో ఆ రికార్డును సొంత చేసకున్నాడు. ప్రస్తుతానికైతే 2.7 మిలియన్స్ మంది ఈ టీజర్ ని చూసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  janatha Garaje  teaser  record  kabali  theri  

Other Articles