vishal linguswamy combination movie pandem kodi 2 heroine fixed

Vishal linguswamy combination movie pandem kodi 2 heroine fixed

manjima mohan, naga chaitanya, hero vishal heroines, vishal pandem kodi, naga chaitanya movie, up coming vishal movies

tamil versitality hero vishal and director linguswamy movie pandem kodi 2 heroine fixed. manjima mohan doing this role. she is now doing nagchaitanya film in telugu

సెంటిమెంట్ తో హిట్ కొడతాడా..?

Posted: 07/09/2016 01:24 PM IST
Vishal linguswamy combination movie pandem kodi 2 heroine fixed

అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడనుకున్న లింగుస్వామి ప్రస్తుతం పందెంకోడి సీక్వెల్ ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాలో కథానాయకుడు విశాల్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ టాలీవుడ్ లో తన మార్క్ వెయ్యాలని చూస్తున్నాడు. అందుకే సినిమా స్టార్ కాస్టింగ్ ని ఆచితూచి ఎంచుకుంటున్నట్లుగా సమాచారం. విశాల్ సరసన హీరోయిన్ గా మంజిమ మోహన్ ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంజిమ మోహన్ గౌతం మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే పందెంకోడి సినిమాలో కూడ ఇలాగే అప్పుడే వెండితెరకు పరిచయం అవుతున్న హీరోయిన్ మీరజాస్మిన్ ని తీసుకుని హిట్ కొట్టాడు విశాల్. ఇప్పుడు అదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ చేసేందుకు ఇలా వెండితెరకు ఇప్పుడిప్పుడే పరిచయం అయిన మంజిమ మోహన్ ని తీసుకున్నాడని చెప్తున్నారు కోలీవుడ్ వర్గాలు.

కొత్తగా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన మంజిమ ఇప్పుడు తన రెండో సినిమానే విశాల్ లాంటి స్టార్ హీరోతో దక్కేసరిగి అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గౌతం మీనన్ డైరెక్షన్ లో పరిచయం అయిన హీరోయిన్స్ అందరూ టాప్ రేంజ్ కి వెళ్లారు. మరి మంజిమ మోహన్ ఆ రేంజ్ ని అందుకుంటుందో లేదో చూడాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya heroine  manjima mohan  hero vishal  director linguswamy  pandem kodi 2  

Other Articles