వెండితెర దృశ్యకావ్యానికి మూడేళ్లు... | baahubali shooting completed 3 years

Baahubali shooting completed 3 years

Baahubali firstday shooting, baahubali completed 3 years, baahubali official twitter page, baahubali photos, prabhas in baahubali shooting

Rajamouli's prestigious project baahubali completed 3 years shooting on july 6. Baahubali team posted this on their official twitter.

వెండితెర దృశ్యకావ్యానికి మూడేళ్లు...

Posted: 07/06/2016 03:05 PM IST
Baahubali shooting completed 3 years

మూడేళ్లు.. సరిగ్గా మూడేళ్ల క్రితం ఓ తెలుగు సినిమా ఖండాంతరాలు దాటి భారతీయ చలన చిత్ర స్థాయిని పెంచుతుందని బహుశా ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా ఊహించి ఉండడేమో! విదేశాల్లో ఇప్పటికీ విడుదలవుతూ అక్కడి ప్రజల మన్ననలు అందుకోవటంతోపాటు ఓ తెలుగు సినిమాను ప్రపంచమంతా ఆసక్తికరంగా మాట్లాడుకునేలా తీర్చిదిద్దాడు జక్కన్న. 'బాహుబలి'  తెలుగు సినిమా వైభవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిందనటంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అలాంటి ఈ వెండి తెర దృశ్య కావ్యానికి మూడేళ్లు నిండాయి.

సరిగ్గా ఈ రోజున మూడేళ్ల క్రితం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని, అందుకు సంబంధించిన ఫోటోలను ఈ సినిమా అఫీషియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కర్నూల్ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్న మొదటి రోజు షూటింగ్ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను అప్ లోడ్ చేశారు. ''ఈ ప్రయాణంలో ఎన్నో గుర్తులు .. ఎన్నో సవాళ్లు .. మరెన్నో విజయాలు .. మాతో పాటు ప్రయాణించిన అందరికీ కృతజ్ఞతలు'' అని ఈ సినిమా టీమ్ చెప్పింది.

'బాహుబలి' సినిమాను మొదటి రోజున ఎంతటి ఉత్సాహంతో ఆరంభించామో .. ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నామని అన్నారు. అండగా నిలిచి ప్రోత్సహించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రెండవ భాగానికి సంబంధించిన యుద్ధ సన్నివేశాలను శరవేగంగా తెరకెక్కించి వచ్చే సమ్మర్ కల్లా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  rajamouli  3 years  baahubali twitter  prabhas  baahubali 2  

Other Articles