జగ్గూభాయ్ హాలీవుడ్ ట్రైలర్ వచ్చింది | BFG movie telugu official trailer released

Bfg movie telugu official trailer released

jagapathi babu voice over to Spielberg movie, Jagapathi babu hollywood movie trailer release

BFG movie telugu official trailer released. Steven Spielberg directed and Tollywood hero Jagapathi Babu voice over to BFG animation movie.

జగ్గూభాయ్ హాలీవుడ్ ట్రైలర్ వచ్చింది

Posted: 07/04/2016 05:46 PM IST
Bfg movie telugu official trailer released

టాలీవుడ్ హీరో జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు... మరో రకంగా కూడా బిజీ అయిపోయాడు. హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీఫెన్ స్పీల్ బర్గ్ నుంచి వచ్చిన మరో చిత్రం బీఎఫ్ జీ. జూలై 1న హాలీవుడ్ లో ఈ చిత్రం విడుదలైంది. ఇక ఈ చిత్ర తెలుగు, తమిళ వర్షన్ లకు ప్రముఖ నటుడు జగపతిబాబు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల చేసింది సహ సమర్పకురాలిగా వ్యవహారిస్తున్న రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్.  

ట్రైలర్ ను గనక పరిశీలిస్తే... భారీ కాయుల మద్య చిక్కుకు పోయే ఓ చిన్న పిల్ల గాథే ఈ చిత్రం. ఓ ముసలి పాత్ర సాయంతో ఆ చిన్నారి అక్కడి నుంచి ఎలా బయటపడిందన్నేది కథాంశం. వాల్ట్ డిస్నీ నిర్మించిన ఈ భారీ ఎడ్వంచరస్ సినిమాలో ఇరవై నాలుగు అడుగుల పొడవుండే ఓ భారీ కాయుడి పాత్రకు ఆయన డబ్బింగ్ చెప్పాడు. అయితే అది జగపతి బాబు గొంతేనా అన్న అనుమానాలు కలగక మానదు. అంతలా వాయిస్ మార్చి మరీ డబ్బింగ్ చెప్పటం విశేషం.

బేసిగ్ గా మాంచి బేస్ ఉన్న వాయిస్ ఉన్న నటుడైనప్పటికీ ఏరి కోరి మరీ తీసుకుని ఇలా గొంతు చేంజ్ చేసి డబ్బింగ్ చెప్పించటం దారుణం. ప్రస్తుతం హాలీవుడ్ ఓ మోస్తరుగానే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బీ ఎఫ్ జీ ఈ నెల 15 న  తెలుగులో విడుదల కానుంది. జగ్గూ బాయ్ పేరు మీద మరి ఇక్కడైనా కాసులు రాలుతాయేమో చూడాలి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagapathi babu  BFG telugu movie  Steven Spielberg  

Other Articles

Today on Telugu Wishesh