బాబాయిని వాడుకుంటాడా? | Reporter Balakrishna title fixed for Kalyan Ram-Puri Movie

Reporter balakrishna title fixed for kalyan ram puri movie

Kalyan Ram as Reporter Balakrishna, Kalyan ram Puri Title Fixed, kalyan ram using Balayya name, Reporter Balakrishna Movie, Isam changed to Reporter Balakrishna, Puri Jagannadh Kalyan Ram Movie

Reporter Balakrishna title fixed for Kalyan Ram-Puri Movie.

బాబాయిని వాడుకుంటాడా?

Posted: 07/04/2016 05:35 PM IST
Reporter balakrishna title fixed for kalyan ram puri movie

ఒక్క సింగిల్ డైలాగ్ తో హీరోయిజాన్ని చూపించడంతోపాటు, హీరో పాత్ర ఎలాంటిదో చెప్పేస్తుంటాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అంతేనా హీరోల టోటల్ లుక్కును మార్చేయటంలో పూరీని మించిన వారే లేరనే చెప్పాలి. ఇక ఇప్పుడు నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ లోని కొత్త యాంగిల్ ను బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నాడు.

పూరీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో కళ్యాణ్ రామ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆపై స్పెయిన్ షెడ్యూల్ తో చిత్రం షూటింగ్ పూర్తి కానుందట. ఇక ఈ సినిమాకి 'ఇజం' అనే పేరు ఫిక్స్ చేసినట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం 'రిపోర్టర్ బాలకృష్ణ' అనే టైటిల్ ను కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏదైనానా లేక మరో టైటిల్ ఫిక్స్ చేస్తారా అన్న విషయంలో సాయంత్రానికి గానీ, లేక రేపు గానీ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  జూలై 5న అంటే రేపు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దర్శకుడు పూరీ విడుదల చేసే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్ మొదటిసారి ఓ జర్నలిస్ట్ పాత్రలో  నటించబోతున్న ఈ చిత్రానికి రిపోర్టర్ బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ అయితే మాత్రం నందమూరి అభిమానులకు పండగే.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  Puri Jagannadh  Reporter Balakrishna  

Other Articles