హీరో కొంపకు ఎసరు పెట్టిన మోడల్ | Kendall Jenner buying John Krasinski lavish home

Kendall jenner buying john krasinski lavish home

Kendall Jenner second home, John Krasinski lavish home, Kendall Jenner buying John Krasinski lavish home, Model Kendall Jenner

Kendall Jenner buying John Krasinski lavish home. 20 year actress spend $6.5million on her SECOND home a six bedroom, five bathroom at Hollywood Hills mansion.

హీరో కొంపకు ఎసరు పెట్టిన మోడల్

Posted: 07/02/2016 03:50 PM IST
Kendall jenner buying john krasinski lavish home

సెలబ్రిటీలు వాడి పడేసిన వస్తువులపై, వాహనాలపై గిరాకీ యమగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపాటి సెలబ్రిటీలు వాటిని మోజు పెంచేసుకోని ఎంత రేటైనా సరే పెట్టి వాటిని కొనేయటం ఈ మధ్య అదో ట్రెండ్ గా మారిపోయింది. కానీ, ఓ స్టార్ హీరో ఇల్లు, అదీ కోట్లు ఖర్చయ్యే ఇంటిపై కన్నేయటంమే కాదు తెలివిగా కాస్త తక్కువ సొమ్మకు తన సొంతం చేసుకుంది ఓ అందగత్తె.

వ్యక్తిగత కారణాలతో హాలీవుడ్ నటుడు జాన్ క్రాసిన్స్కీ తన కాస్ట్ లీ ఇంటికి బేరానికి పెట్టాడు. తొలుత 8 మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు యాడ్ కూడా ఇఛ్చాడు.  ఆరు విలాసవంతమైన బెడ్రూమ్స్, విశాలమైన హాల్స్, ఐదు బాత్రూమ్స్ కలిగిన ఆ ఇంటిని అంత పెట్టి కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కాస్త వెనక్కి తగ్గి, రేటు విషయంలో తగ్గాడు. అంతే అమెరికన్ సూపర్ మోడల్ కెండల్ జెన్నర్ వెంటనే ముందకు వచ్చింది. బేరసారాలు బాగానే జరిగి చివరికి 6.5 మిలియన్ల డాలర్లకు లగ్జరీ కొంపను సొంతం చేసుకుంది.

తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 20 ఏళ్ల కెంటర్ ఈ విషయాలను వెల్లడించింది. ముందు అంత పెట్టలా అని ఆలోచించా కానీ, అంతలోనే ఆయన రేటు తగ్గించేశారు. నా అదృష్టం ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆ భవంతిలో నేను సింగిల్ గా ఎంజాయ్ చేస్తున్న అని చెబుతోంది. కాగా జెన్నర్‌ గతంలోనే 1.39 డాలర్లతో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఇప్పుడు క్రాసిన్ స్కీ  ఇంటిని సొంతం రెండో ఇంటిది అయ్యింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : John Krasinski  lavish mansion  Kendall Jenner  model  

Other Articles