బాహుబలి కంటే నిజంగా తోపు... | Vijay Antony Bichagadu Telugu Movie Completed 50 days

Vijay antony bichagadu telugu movie completed 50 days

Vijay Antony Bichagadu, Bichagadu 50 days, Vijay Antony Bichagadu Collections

Vijay Antony Bichagadu Telugu Movie Completed 50 days.

బాహుబలి కంటే నిజంగా తోపు...

Posted: 07/02/2016 01:20 PM IST
Vijay antony bichagadu telugu movie completed 50 days

బిచ్చగాడు మొదట్లో ఈ పోస్టర్స్ చూసి అయ్యా ఇదేం టైటిల్ అనుకున్నారు. ఇక ఇది తమిళ్ చిత్రం కావటం, పైగా విజయ్ ఆంటోనీకి ఇక్కడ ఫేస్ వాల్యూ లేకపోవటంతో పిచ్చ లైట్ తీస్కున్నారు. ఒకటి రెండు రోజులు, అరకోర థియేటర్లతో ఆడి వెళ్లిపోతుందని అంతా భావించారు. కానీ, సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.

మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 50 థియేటర్లలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు రెండు వందల థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ బిచ్చగాడి దయతో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఇంట కాసుల వర్షం గలగల రాలుతుంది.

ఓ తల్లి ఆరోగ్యం కోసం 48 రోజులపాటు బిచ్చగాళ్ల మధ్య వ్రతం చేస్తూ బతికే మల్టీమిలినియర్ కథే చిత్రం. సహజత్వంతో కూడిన కథా కథనం ఉండటంతో జనాలకు తొందరగా రీచ్ అయిపోవటం ఈ బిచ్చగాడి కున్న ప్రత్యేకత. రెండు కోట్లతో సినిమా ఈ సినిమా వసూలు చేసింది పదిరెట్లకు పైగానే వసూలు చేసింది. మాతృక తమిళ్ లో పిచ్చైక్కారన్ గా వచ్చిన ఈ చిత్రం వసూళ్లు తెలుగులోనే ఎక్కువగా ఉండటం మరీ దారుణం.

ఈ మధ్య తెలుగులో ఒకటి రెండు బడా చిత్రాలు తప్పా ఏవీ 50 రోజులు ఆడలేదు. అవి కూడా అతితక్కువ సెంటర్లలోనే ఆడాయి. కానీ, కేవలం మౌత్ పబ్లిసిటీతో ఆడుతున్న బిచ్చగాడు ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కూడా ఉన్న సినిమాలను లేపేసి ప్రస్తుతం మల్టీఫ్లెక్స్ లలో కూడా బిచ్చగాడినే వేస్తున్నాడు. మున్ముందు మరిన్ని వండర్స్ క్రియేట్ చేసి వందరోజులు పూర్తి చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Antony  Bichagadu  50 days  

Other Articles