బన్నీ ఈసారి గమ్మునుండవోయ్... | Bunny again fire on Pawan fans at SIIMA

Bunny again fire on pawan fans at siima

Bunny again satires on pawan Fans, Bunny pawan fans, Gammunundavoyi Comments, Bunny at SIIMA-2016

Allu Arjun again fire on Pawan fans at SIIMA. Says Gammunundavoyi to pawan kalyan fans.

బన్నీ ఈసారి గమ్మునుండవోయ్...

Posted: 07/01/2016 06:48 PM IST
Bunny again fire on pawan fans at siima

సినిమా హీరోగానే వివాదాల్లోనూ అల్లు అర్జున్ ఒక సపరేట్ స్టైల్, ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆడియో పంక్షన్లలో, వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న అతికి ఎలా పుల్ స్టాపు పెట్టాలో తెలీక కాస్త గట్టిగానే స్పందించాడు. విజయవాడలో జరిగిన సరైనోడు సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్న సమయంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ సింపుల్ గా మాట్లాడి విమర్శలు ఎదుర్కున్నాడు.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా చెప్పను బ్రదర్ అనే యాష్ ట్యాగ్ పేరుతో జోకులు పేలాయి. బన్నీపై పవన్ అభిమానుల నుంచి కాస్త బూతు పురాణమే వల్లించారు. అయితే దీనంతటిపై ఒక మనసు ఆడియో పంక్షన్లో స్పందించాడు అర్జున్. మెగా ఈవెంట్లలోనే కాదు వేరే వాళ్ల పంక్షన్లో కూడా అరుస్తున్నారనే కంప్టైంట్స్ వస్తున్నాయని, ఆ అవసరం ఏంటని? మీరు అడక్కపోయినా పవన్ గురించి మాట్లాడతామని ఓ పావుగంట క్లాస్ పీకాడు. దీంతో ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిందని అంతా అనుకున్నారు.

అయితే తాజాగా సైమా వేదికగా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. రుద్రమదేవికిగానూ ఉత్తమ నటుడు క్రిటిక్స్ అవార్డు అందుకున్నాడు బన్నీ. ఈ సందర్భంగా సింగపూర్ పవర్ స్టార్ అభిమానులు కూడా పవన్ పవన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మైక్ అందుకున్న బన్నీ గమ్మునుండవోయ్... మాట్లాడనీ అంటూ తన ఉపన్యాసం కొనసాగించాడు. మరీ ఈసారి ఈ పదం మరేంత వివాదం రాజేస్తుందో చూడాలి.     

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Pawan kalyan fans  SIIMA-2016  Gammunundavoyi  

Other Articles