vikram hero irumurugan telugu poster released at siima award function

Vikram hero irumurugan telugu poster released at siima award function

irumurugan, vikram movie, vikram irumurugan, vikram next movie, vikram upcoming movie, irumurugan vikram stills, inkokkadu stills, ikokkadu poster

hero vikram irumurugan movie telugu poster named inkokkadu poster released at siima awards at singapore, this poster released by megastar chiru in siima

'ఇంకొక్కడు' గా వస్తున్నాడు...!

Posted: 07/01/2016 10:51 AM IST
Vikram hero irumurugan telugu poster released at siima award function

ఐ సినిమా ఫ్లాప్ తర్వాత విక్రమ్ మళ్లీ తెలుగు వెండితెరపై కనిపించలేదు. ఇప్పుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఇంకొక్కడు గా తెలుగులో మళ్లీ కనిపించి కనువిందు చేయబోతున్నాడు. గత కొంతకాలంగా ఇరుమురుగన్ సినిమాని ఇంకొక్కడు అంటూ తెలుగులో టైటిల్ ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్ ని కన్ ఫార్మ్ చేస్తూ చిత్రయూనిట్ పోస్టర్స్ ని రిలీజ్ చేసింది. సింగపూర్ లో జరుగుతున్న సైమా వేడుకల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా పోస్టర్స్ ని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వర్క్ పూర్తయ్యిందని త్వరలోనే ఆడియోని విడుదల చేస్తామని చెప్తోంది చిత్రయూనిట్. ఈ సినిమాని ఆగస్ట్ 12వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో కూడ సేమ్ డేట్ కి విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. గతంలో విక్రమ్ సమంతలు నటించి టెన్ ఎండ్రాతకుల్లా సినిమా తెలుగులోకి అనువదించలేదు. ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vikram movies  chiyan vikram  vikram hero tamil  vikram irumurugan  nayanatara  nithya menon  

Other Articles