ఆల్జీమర్స్ వ్యాధి తో ప్రకాశ్ రాజ్? | Prakash Raj as alzheimer patient for kannada remake

Prakash raj as alzheimer patient for kannada remake

prakash raj as alzheimer patient, Godhi Banna Sadharana Mykattu remake, GBSM remake, prakash raj in GBSM remake, prakash raj as alzheimer patient for kannada remake, ప్రకాశ్ రాజ్, కన్నడ రీమేక్ లో ప్రకాశ్ రాజ్, అల్జీమర్ వ్యాధితో ప్రకాశ్ రాజ్, ప్రకాశ్ రాజ్ మతిమరుపు వ్యాధి, మతిమరుపు పేషెంట్ గా ప్రకాశ్ రాజ్, తాజా వార్తలు, ప్రకాశ్ రాజ్ ఆ రీమేక్ లో, కన్నడ రీమేక్ లో ప్రకాశ్ రాజ్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, Entertainment, telugu movies, prakash raj no movies

Prakash Raj as alzheimer patient for kannada remake. Prakash raj set to remake 'Godhi Banna Sadharana Mykattu.

ఆల్జీమర్స్ వ్యాధి తో ప్రకాశ్ రాజ్?

Posted: 06/23/2016 05:38 PM IST
Prakash raj as alzheimer patient for kannada remake

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ఊపు ఊపిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఒక్క తెలుగులోనే కాదు సౌత్ లో ఆయనకు అవకాశాలు రావటం లేదు. ఒకప్పుడు ఏడాదికి డజన్ల కొద్దీ సినిమాలతో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారాయన. ఇప్పుడున్న నటుల్లో ఓ తండ్రిగా, ఓ అన్నగా, ఓ మావగా, విలన్ గా, ఇలా అన్నిరకాల పాత్రల్లో నటించిన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క ప్రకాశ్ రాజే అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడాయన సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది.

దీంతో సినిమాలు లేక అడపా దడపా సొంత ప్రాజెక్టులు చేసుకుంటూ మధ్యలో తాను దత్తత తీసుకున్న ఊరి బాగోగులు చూసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మన ఊరి రామాయణం పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య వచ్చిన కన్నడ సినిమా ఒకటి ప్రకాశ్ రాజ్ ను బాగా ఆకట్టుకుందట. దీంతో ఆ సినిమాను రూపొందించేందుకు సిద్ధమైపోయాడు.

కన్నడలో సీనియర్ నటుడు అనంత్ నాగ్ ప్రధాన పాత్రలో,  రక్షిత్ శెట్టి హీరోగా గోధి బన్న సాధారణ మైకత్తు అనే ఓ సినిమా వచ్చింది. అల్జీమర్ (మతిమరుపు) వ్యాధితో బాధపడే వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోతే అతన్ని వెతుక్కుంటూ వెళ్లే కొడుకు కథా నేపథ్యమే ఈ చిత్రం. కథ బాగా నచ్చడంతో తానే ప్రధాన పాత్రలో అంటే అల్జీమర్ తో బాధపడే వ్యక్తి పాత్రలో ఆ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు ప్రకాశ్ రాజ్. తమిళ్, తెలుగు ద్వి భాషా చిత్రంగా తెరకెక్కనున్న దీనికి ప్రకాశ్ రాజే దర్శకత్వం వహించే అవకాశం ఉంది. కొడుకు పాత్ర కోసం యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash raj  alzheimer patient  GBSM remake  Godhi Banna Sadharana Mykattu  

Other Articles