మురగదాస్ మూవీ కోసం రేణుదేశాయ్ వెయిటింగ్ | Renu Desai excite about murugadoss upcoming film

Renu desai excite about murugadoss upcoming film

Pawan kalyan ex wife, renu desai, akira movie, sonakshi sinha Akira, సోనాక్షి సినిమా కోసం రేణు దేశాయ్ ఎగ్జయిట్, అకీరా కోసం రేణూదేశాయ్, పవన్ మాజీ భార్య మహేష్ దర్శకుడి కోసం, తెలుగు వార్తలు, తాజా వార్తలు, సినిమా వార్తలు, movie news, latest news, pawan kalyan news, renu desai murugadoss

Pawan Kalyan's ex wife Renu Desai seems to be very excited about director AR Muragados upcoming Bollywood film. Reason? The film was titled as Akira, name of her son. There was another reason for the excitement for actress turned director. Incidentally the movie is slated for release on September 2 which happens to be Pawan Kalyan’s birthday

మురగదాస్ మూవీ కోసం రేణుదేశాయ్ వెయిటింగ్

Posted: 06/22/2016 05:41 PM IST
Renu desai excite about murugadoss upcoming film

స్టార్ దర్శకుడు మురగదాస్ అప్ కమింగ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఆయన తదుపరి చిత్రం మహేష్ బాబుతో అనే విషయం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే ఈ సందేశాత్మక చిత్రం ఎలా ఉండబోతుందని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే సూపర్ స్టార్ తో తెరకెక్కించబోయే ఈ చిత్రంపై పవర్ స్టార్ మాజీ వైఫ్ కి ఎందుకంత ఇంట్రస్ట్ అనుకుంటున్నారా?

అసలు రేణు ఆత్రుతగా ఎదురు చూసేది మహేష్-మురగదాస్ చిత్రం కోసం కాదులేండి. ప్రస్తుతం బాలీవుడ్ లో మురగదాస్ అకీరా అనే లేడీ ఓరియంటల్ చిత్రాన్ని తీస్తున్నాడు. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవలె విడుదలైంది. ఆడవాళ్ల భద్రత ఇతివృత్తంగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం అపసోపాలు పడి ఎట్టకేలకు సెప్టెంబర్ 2న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ ట్వీట్టర్లో అకీరా చిత్రం గురించి ఫుల్ వెయిటింగ్ అంటూ ట్వీట్ చేసింది.

పవన్ కళ్యాణ్ తనయుడి పేరు అకీరా అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే రేణు ఆ చిత్రం కోసం అంతలా ఎదురుచూస్తుందట. అంతేకాదు ఆ రోజు స్పెషల్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకంటా... ! అవును పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. అందుకే రేణూ దేశాయ్ అంతలా డబుల్ ఎగ్జయిట్ అయిపోతుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan ex wife  renu desai  sonakshi sinha Akira  

Other Articles