niharika heroine movie okamanasu releasing date confirm

Niharika heroine movie okamanasu releasing date confirm

niharika, niharika next, niharika movie, niharika hot, niharika movie, niharika okamanasu, niharika nagasourya, nagasourya next movie, niharika movie, niharika actress, varunteja sister

heroine niharika acted movie okamanasu releasing date confirmed. this movie niharika introducing as a heroine.

మెగా పాప వచ్చేస్తోంది...!

Posted: 06/21/2016 01:26 PM IST
Niharika heroine movie okamanasu releasing date confirm

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వస్తున్న కొణిదెల నిహారికా హీరోయిన్ గా, నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా ఒక మనసు. ఈ సినిమాకి రామరాజు దర్శకత్వం వహించాడు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాని జూన్ 24వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆవకాయ్ బిర్యానీ అంటూ యూట్యూబ్ సీరిస్ ద్వారా తన అభినయంతో అందర్ని ఆకట్టుకున్న నిహారిక ఈ సినిమా ద్వారా వెండితెరపై హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే యాంకర్ గా మంచి మార్కులు కొట్టేసిన ఈ మెగా పాప వెండితెరపై ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మొట్టమొదటి హీరోయిన్ గా తెరంగేట్రం చేయనుంది నిహారిక. ఒక మనసు చిత్రం తన భవితవ్యాన్ని తేల్చనుంది. ఈ సినిమా హిట్ అయితే ఇక నిహారిక కి ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వస్తాయని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఖచ్చితంగా తన అభినయంతో ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : niharika acting  niharika okamanasu  nagababu daughter  varun teja sister  

Other Articles