film fare awards in 2016 tollywood as well as kollywood

Film fare awards in 2016 tollywood as well as kollywood

film fare awards, film fare awards in 2016, film fare awards anushka, rudramadevi film fare, best hero film fare, maheshbabu srimanthudu, geetha madhuri,nani,devisri,allu arjun,anushka,sienthil

film fare awards held in hyderabad in saturday june 2016. the most awrads are given by star heros and heroines in this year. telugu film awards and as well as tollywood movie.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విజేతలు..!

Posted: 06/20/2016 01:44 PM IST
Film fare awards in 2016 tollywood as well as kollywood

హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో నిర్వహించిన ఈ 63వ ఫిలిం ఫేర్ పురస్కారాల వేడుకకు దక్షిణాది చిత్ర పరిశ్రమకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి ఫిలింఫేర్ అవార్డులను ప్రదానం చేశారు.  సినీ తారల ఆట పాటల మధ్య సాగిన ఈ వేడుకలో తెలుగు సినిమాకు సంబంధించి గత సంవత్సవరం విడుదలై ‘బాహుబలి’ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాకు గాను ఉత్తమ నటుడు అవార్డ్ ను అందుకున్నాడు.

తెలుగులో అవార్డుల వివరాలు పరిశీలిస్తే జీవిత సాఫల్యం: మంచు మోహన్ బాబు, ఉత్తమ చిత్రం: బాహుబలి, ఉత్తమ నటుడు: మహేశ్ బాబు(శ్రీమంతుడు) , ఉత్తమ నటి: అనుష్క (రుద్రమదేవి),
ఉత్తమ నటుడు(తొలి పరిచయం): అఖిల్, ఉత్తమ నటి(తొలిపరియం): ప్రగ్యా జైశ్వాల్ , ఉత్తమ సహాయనటుడు: అల్లు అర్జున్(రుద్రమదేవి), ఉత్తమ సహాయనటి: రమ్యకృష్ణ(బాహుబలి), ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి(బాహుబలి), ఉత్తమ నటి( క్రిటిక్స్ జ్యూరీ అవార్డు): నిత్యా మేనన్( మళ్లీ మళ్లీ ఇది రాని రోజు) , ఉత్తమ నటుడు( క్రిటిక్స్ జ్యూరీ అవార్డు): నాని (భలే భలే మగాడివోయ్) , ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ వి.జె (కున్ఫూ కుమారి-బ్రూస్లీ), ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కె.కె. సెంథిల్కుమార్(బాహుబలి) , ఉత్తమ నేపథ్య గాయకురాలు: గీతా మాధురి( జీవనది-బాహుబలి), ఉత్తమ నేపథ్య గాయకుడు: ఎం.ఎల్.ఆర్ కార్తికేయన్( పోరా శ్రీమంతుడా-శ్రీమంతుడు), ఉత్తమ గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి( రా ముందడుగేద్దాం-కంచె) , ఉత్తమ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్(శ్రీమంతుడు)

తమిళ నటుడు విక్రమ్, నటి నయనతార ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 63వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దక్షిణాది తారల అందాలతో ఈ కార్యక్రమం గుభాళించింది.

ఈసారి తమిళ చిత్ర పరిశ్రమ గెలుచుకున్న అవార్డుల వివరాలను చూస్తే 'ఐ' చిత్రం నాలుగు అవార్డులను, తనీవరువన్ చిత్రం మూడు అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటాయి.  ఉత్తమ చిత్రం అవార్డును కాక్కాముట్టై సినిమా, ఉత్తమ నటుడి అవార్డును ఐ చిత్రానికి గానూ విక్రమ్, ఉత్తమ నటి అవార్డును నానుమ్ రౌడీదాన్ చిత్రానికి గానూ నయనతార,ఉత్తమ దర్శకుడు అవార్డును తనీఒరువన్ చిత్రానికి గానూ మోహన్‌రాజా, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును ఐ చిత్రానికి గానూ ఏఆర్.రెహ్మాన్ అందుకున్నారు.

అదే విధంగా ఉత్తమ పరిచయ హీరో అవార్డును డార్లింగ్ చిత్రానికి గానూ జీవీ.ప్రకాశ్‌కుమార్, క్రిటిక్స్ జ్యూరీ అవార్డును తనీఒరవన్ చిత్రానికి గానూ జయంరవి,ప్రత్యేక జ్యూరీ అవార్డును 36 వయదినిలే చిత్రానికి గానూ నటి జ్యోతిక,ఉత్తమ సహాయ నటి అవార్డును తంగమగన్ చిత్రానికి గానూ రాధికా శరత్‌కుమార్,ఉత్తమ సహాయనటుడు అ వార్డును తనీఒరువన్ చిత్రానికి గానూ అరవిందస్వామి అందుకున్నారు. అదే విధంగా ఉత్తమ గాయకుడు అవార్డు ఐ చిత్రంలో ఇన్నోడ నీ ఇరుందాల్ పాటకుగానూ సిద్ శ్రీరామ్, ఉత్తమ గాయనీ అవార్డు తంగమగన్ చిత్రంలో ఎన్న సొల్ల అనే పాటకు గానూ శ్వేతామోహన్, ఉత్తమ గీత రచయిత అవార్డు ఐ చిత్రంలోని పూక్కలయో సట్రు పాటకుగాను మదన్‌కార్గీలను వరించాయి.

- మూర్తి

Related Galleries:

Celebrities at 63rd Britannia Filmfare Awards

63rd Britannia Filmfare Awards South Event Photos

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : film fare awards  bahubali  srimantudu  sirivennala  Film fare awards hyderabad.  

Other Articles