ఆ పని మాత్రం చేయదట...! | actress keerthi suresh interview

Actress keerthi suresh interview

keerthi suresh, keethi suresh in tamil, keerthi suresh vs vijay, vijay movie heroine, mollywood actress.

actress keerthi suresh interview : keethi suresh said exposing is different and glamour role in defferent. if glamour roles comes in tollywood i will ready to do that king of charechtors.

ఆ పని మాత్రం చేయదట...!

Posted: 06/16/2016 12:28 PM IST
Actress keerthi suresh interview

మాలీవుడ్ నుంచి వచ్చి నేను శైలజ అంటూ పలకరించి అందరి హృదయాలను కొల్లగొట్టిన భామ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చినా నో అందట. ఎందుకని ఆరాతీస్తే, పర్సనల్ గా కొన్ని విషయాలు చెప్పింది. తెలుగుల ఆఫర్లు వదిలేయడానికి కారణం ఒక్కటే ఎక్స్‌పోజింగ్‌. నేను శైలజా సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. సినిమాలో గ్లామర్‌గా కనిపిస్తూ ఎక్స్‌పోజింగ్‌ చేయా లన్న షరతుపెట్టారు. గ్లామర్‌కు ఓకే కానీ ఎక్స్‌పోజింగ్‌కు నో అనడంతో వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోయారు.

మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలో నటించమని నన్నెవరూ అడగలేదు. అవన్నీ ఊహాగానాలే! ఇవి నాదాకా వచ్చాయి. నాకు తెలియని వాటి గురించి నేను మాట్లాడలేను కదా? అందుకే మౌనంగా ఉండి పోయాను. అని చెప్పింది.
ఏ రోల్‌ చేసినా భవిష్యత్తులో నా భర్తతోనూ, నా పిల్లలతోనూ కలిసి కూర్చుని చూసే సినిమాలే చేస్తాను తప్ప, వారి ముందు తల దించుకుని కూర్చునే సినిమాలు చేయను. ఈ విషయంలో మా మదరే నాకు ఆదర్శమని చెప్పింది. మోడ్రన్‌ డ్రస్‌ల వరకూ ఓకే! అవీ నా శరీరాకృతికి సరిపోయేలా ఉండాలి.

కోలీవుడ్‌ అనే కాదు మాలీవుడ్‌లో కూడా నన్ను ఎక్స్‌పోజింగ్‌ చేయమని ఎవరూ అడగలేదు. మాలీవుడ్‌లో కన్నా కోలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. దాదాపు అయిదు సినిమాలు చేస్తున్నాను. విజయ్ లాంటి పెద్ద హీరోతో చేసే అవకాశం నాకు త్వరగానే లభించింది. చాలా మంచి వ్యక్తి. విజయ్‌ సార్‌ గురించి అందరికీ తెలిసిందే! నేను ప్రత్యేకించి చెప్పేదేముంది? ఆయన 60వ సినిమాలో నాకు అవకాశం రావడం నా అదృష్టమని చెప్పింది.

ధనుష్ తో కలిసి తోడారి మూవీలో మేకప్ లేకుండా నటించి మరింత అందంగా కనిపించిన ఈ భామ మంచి ఆఫర్లు వస్తే తెలుగులో నటిస్తానని చెప్తోంది. కానీ, ఎక్స్ పోజింగ్ అంటే మాత్రం చెయ్యదట. మరి ఈ భామకి ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయో వేచి చూడాల్సిందే.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : keethi suresh  actress keerthi  heroine keerthi suresh  keerthi suresh hot  

Other Articles