స్టైల్ తో చంపేస్తున్నాడు...! | venkatesh babu bangaram movie bussiness analysis

Venkatesh babu bangaram movie bussiness analysis

స్టైల్ తో చంపేస్తున్నాడు...!

Posted: 06/16/2016 11:29 AM IST
Venkatesh babu bangaram movie bussiness analysis

మారుతి దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకులనుంచి , ఇండస్ట్రీనుంచి కూడ ప్రశంసల వర్షం కురుస్తోంది. మారుతితో వెంకటేష్ తొలి కాంబినేషన్ కావడం, నయనతారతో మూడోసారి వెంకటేష్ జత కట్టడం వంటివి 'బాబు బంగారా'నికి మరింత హైప్ తీసుకొచ్చాయి. వెంకటేష్ తన స్టైల్ తో యంగ్ లుక్స్ తో సినిమా టీజర్ లో పిచ్చెక్కించాడు.దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోందట. అన్ని ఏరియాలకు ఉహించిన దానికంటే ఎక్కువ ధరకే హక్కులు అమ్ముడైనట్లు సమాచారం.

వెంకటేశ్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేని విధంగా 'బాబు బంగారం' ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందట. దాదాపు 30 కోట్లకి పైగా బిజినెస్ జరిగిందని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంతేకాదు, తొలిసారి గల్ఫ్‌లో 50కి పైగా థియేటర్లలో 'బాబు బంగారం' విడుదలకి రెడీ అవుతున్నాయి. ఓవర్సీస్ లో కూడ ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ కామెడీ పోలీస్‌గా నటిస్తున్నాడు. వెంకీ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా 'బాబుబంగారం' ఉంటుందని యూనిట్ చెబుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఆడియో రిలీజ్ వేడుకలు జరగనున్నాయి.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles