kalyanram and purijagan movie song shooting at night in market set

Kalyanram and purijagan movie song shooting at night in market set

kalyanram, kalyanram own banner, ntr atrs, puri next film, purijagan new, kalyanram next movie, purijagan director

kalyanram and purijagan movie song shooting at night in market set. this movie is creating good highup in the tollywood. kalyanram producing his own trying to release in this dessara.

కుర్రాడు మార్కెట్ లోకి వచ్చాడు...!

Posted: 06/15/2016 01:48 PM IST
Kalyanram and purijagan movie song shooting at night in market set

పూరి జగన్నాథ్‌ సినిమా అంటేనే హీరోయిజం. కథానాయకుడి పాత్రని తెరపై ఆవిష్కరించడంలో పూరి సిద్ధహస్తుడు. హీరో అంటే... పాటలూ, ఫైటింగులూ మామూలే కదా...! ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నందమూరి కుర్రాడు మార్కెట్‌లోకి వచ్చి ఓ పాటేసుకొంటున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కళ్యాణ్ రామ్‌ కథానాయకుడు. అతిథి ఆర్య హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో అర్ధరాత్రి నేపథ్యంలో మార్కెట్‌ పరిసరాల్లో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. దీనికి దినేష్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం కళ్యాణ్‌రామ్‌ తన లుక్‌ని పూర్తిగా మార్చేశారు. చిరు గెడ్డం, కళ్లజోడుతో స్టైలిష్‌గా కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన లుక్‌ని కూడా పూరి ఇదివరకే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మేటర్ ఏంటంటే ఈ సినిమా వచ్చే నెల నుంచి స్పెయిన్‌లో కీలక షెడ్యూల్‌ తెరకెక్కించే ఆలోచనలో ఉందట.

అసలే మాస్ యాక్షన్ హీరో పైగా పూరీ చేతిలో పడ్డాడు ఇక సినిమా బ్లాక్ బస్టరే అంటున్నారు అందరూ.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyanram  purijaganath  puri  mohrin  actress mohrine  purijagan director  

Other Articles